/rtv/media/media_files/2025/03/26/u1n27fFOHJLtkaCq1R5C.jpeg)
10th student suicide
జీవితంలో సక్సెస్, ఫెల్యూర్ ఒక భాగం మాత్రమే. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రానా జీవితమే అయిపొయింది అనుకోవడంలో అర్థమే లేదు. పరీక్షల్లో ఫెయిలైనా లైఫ్ ఎంతో మంది.. వ్యాపారవేత్తలుగా, ఎంట్రప్రెన్యూర్స్ గా, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడానికి, టాలెంట్ కి ఏ మాత్రం సంబంధం లేదనే చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు కొంతమంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. 10వ తరగతి పరీక్షలు సరిగ్గా రాయలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Also Read : బెట్టింగ్ యాప్ కేసులో కీలక మలుపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
పరీక్ష సరిగ్గా రాయలేదని..
నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పూజిత భార్గవి అనే విద్యార్థిని స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఇప్పటికే 10th పరీక్షలు మొదలవగా.. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాసింది. అయితే సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్ష సరిగ్గా రాయలేదని తీవ్రమనస్థాపానికి గురైంది పూజిత. తాను ఫేయిల్ అవుతానేమో అనే భయంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎదిగిన కూతురు కళ్ళ ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి
Also Read : ‘కోర్టు’ కిక్కే కిక్కు.. రూ.10 కోట్ల బడ్జెట్- రూ.50 కోట్ల కలెక్షన్- USలో రచ్చ రచ్చే
nalgonda | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | telangana crime case | telangana crime incident | telangana crime news | telangana-crime-updates