/rtv/media/media_files/2025/02/12/9QgRsBtw2YYNAkDc6VqO.webp)
Betting Apps case Anchor Shyamala approaches Telangana High Court
బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ వేసిది. దీనిపై ఈ రోజే కోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు శ్యామలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. Andhra365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేశారు. ఇక విష్ణుప్రియతోపాటు రీతూచౌదరిని గురువారం పంజాగుట్ట పోలీసులు విచారించారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
హైకోర్టులో ఆశ్రయించిన యాంకర్ శ్యామల
— Telangana Awaaz (@telanganaawaaz) March 21, 2025
బెట్టింగ్ కేసులో తనమీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని యాంకర్ శ్యామల పిటిషన్
శ్యామల పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యాంకర్ శ్యామలపై కేసు నమోదు
Andhra365 అనే ఆన్లైన్… pic.twitter.com/5PnYxXOPZi
Also Read : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. RCB Vs KKR తొలి మ్యాచ్ రద్దు!?
Anchor Shyamala Approaches Telangana High Court
బెట్టింగ్ యాప్ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 25 మందిపై కేసు నమోదు చేయగా మరికొంతమంది సెలబ్రిటీల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేసి, బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా జనాలను అలరించిన శివజ్యోతి సైతం బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'ఇప్పటికీ కూడా జనాలు మనదగ్గరకు వచ్చి బాగా హార్డ్ వర్క్ చేస్తే పైసలు సంపాదించొచ్చు అని చెబుతున్నారా? అయితే అసలు పట్టించుకోకండి. ఇప్పడు మీ డ్రీమ్ రన్ ను 1XBET తో ప్రారంభించండి' అంటూ ఆమె చెప్పిన వీడియోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
ఈమెని కాపాడుతున్నది ఎవరు సర్ ?@SajjanarVC
— Telangana Buzz (@BuzzTelangana) March 20, 2025
పల్లెటూరి యువతని బెట్టింగ్ వైపు ఆకర్షించి ఎందరో అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈమెపై ఇంకా కేసు ఎందుకు నమోదు అవ్వడం లేదు ?? pic.twitter.com/1cHJdr5W5L
Also Read : నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూయిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఈ రోజు తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి ఆమె విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు? వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు, లావాదేవీలు జరిగాయి? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీ, తెలంగాణలో ఎండలకు బ్రేక్.. వర్షాలకు వెల్‌కమ్-ఎక్కువగా ఈ జిల్లాల్లోనే!
betting-app | today telugu news | latest-telugu-news | telangana-high-court | today-news-in-telugu