Ukraine: భారత్‌లో జెలెన్‌స్కీ పర్యటన..

ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ఏడాది చివరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ రాయబారే కన్ఫామ్ చేశారు. అయితే ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జెలెన్‌స్కీ ఇక్కడకు రానున్నారు.

New Update
Modi : మోదీకి ఉక్రెయిన్‌ అధ్యక్షుని శుభాకాంక్షలు!

Zelenskyy India Tour: కిందట నెలలో భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ని భారత్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ఏడాది చివర్లో ఇండియాలో పర్యటించనున్నారు. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ జెలెన్‌స్కీ భారత్‌కు రావం గ్యారంటీ అని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ఇప్పటికే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకుంటూ ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఇప్పుడు ఆదేశ అధ్యక్షుడు కూడా ఇండియాకు వస్తే..మరో అడుగు ముందుకు పడినట్టు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.. అని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ అన్నారు.

1991లో సోవియట్‌ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన తర్వాత ఓ భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం మొన్నే మొదటిసారి. అంటే 33 ఏళ్ళ తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ వెళ్ళారు. ఈ నేపథ్యంలో చర్చలు, దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు వంటి విషయాల మీద ఇరు దేశాధినేతలూ చర్చించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనకు ఇండియా అన్ని విధాలా సహకారం అందిస్తుందని..కృషి చేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. యుద్ధం కంటే శాంతి వైపే తమ చూసు ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భారత్‌కు వస్తే ఈ విషయం మరోసారి చర్యలు జరిగే అవకాశంతో పాటూ... ఆదిశగా అడుగులు వేసే పరిణామాలు కూడా సంభవిస్తాయని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి.

Also Read: Gauthi: ఐఐటీ గువాహటిలో విద్యార్థి ఆత్మహత్య

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment