Uber: అరే ఏంట్రా ఇదీ..ఊబర్ బిల్లు కోటి రూపాయలు రావడమేంట్రా.. ఊబర్ క్యాబ్‌ల బిల్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా కోట్లలో ఛార్జీలు చూపిస్తూ కస్టమర్లకు ఫాక్‌లు ఇస్తున్నాయి. మొన్న గురుగావ్‌లో ఒక వ్యక్తికి 7 కోట్ల ఛార్జీ చూపిస్తే..ఇవాళ బెంగళూరులో తెలుగు వ్యక్తి కోటి ముప్పైలక్షలు బిల్లు చూపించింది. By Manogna alamuru 03 Apr 2024 in Latest News In Telugu వైరల్ New Update షేర్ చేయండి Uber Cab Chargers: క్యాబ్ కష్టాలు ఈమధ్య కాలంలో మరీ ఎక్కువ అయిపోతున్నాయి. సమయానికి బుక్ అవ్వకపోవడం, బుక్ అయినా ఎక్కువ ఛార్జ్ చేయడంతో పాటూ అడ్డగోలుగా చూపిస్తున్న ఛార్జీలు ఇప్పుడు కొత్తగా హడలు పుట్టిస్తున్నాయి. ఈ ఛార్జీలు పదో పరకో అయితే పర్లేదు భయ్యో కానీ...కళ్ళు తిరిగి పడిపోయేంత చూపిస్తేనే కష్టం అంటున్నారు కస్టమర్లు. లక్షల్లో, కోట్లలో వస్తున్న క్యాబ్ ఛార్జీలను చూసి లబోదిబోమంటున్నారు. రీసెంట్‌గా ఇలా చుక్కలు చూపించే బిల్లు రావడం మరీ ఎక్కువ అయిపోయింది. సంబంధం లేకుండా వస్తున్న బిల్లులు.. జనరల్‌గా మనం క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడే ఎంత బిల్లు అవుతుంది అన్నది మనకు తెలిసిపోతుంది. మనం బుక్ చేసే దూరానికి ఇంత పడుతుంది అనేది మన యాప్‌లో స్క్రీన్ మీద ముందే కనిపిస్తుంది. దీన్ని బట్టే కస్టమర్ క్యాబ్‌ను బుక్ చేసుకుంటారు కూడా. అయితే ఈ బిల్లులు చూపించడంలో కూడా ఇప్పుడు తెగ ఫ్రాడ్ నడుస్తోంది. మనం బుక్ చేసేటప్పుడు ఒక అమౌంట్ చూపిస్తూ...రైడ్ అయ్యాక మరో అమౌంట్ చూపిస్తోంది. రెండింటికీ తేడా కూడా చాలానే ఉంటుంది. 60 నుంచి 80రూ.ల తేడా కూడా చూపిస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్లను అడిగితే...వాళ్ళు చెప్పే సమాధానం మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. సదరు యాప్‌కు కాల్ చేసి కనుక్కోండి అని. సరేనని యాప్‌లో కంప్లైంట్ చేస్తే రెస్పాన్స్ ఉండదు. ఇలా ఈమధ్యకాలంలో చాలా ఎక్కువగానే క్యాబ్ సర్వీసుల మీద కంప్లైంట్‌లు వినిపిస్తున్నాయి. కోటి రూపాయలు బిల్లు... మొన్నటికి మొన్న ఢిల్లీలో గుర్‌గావ్‌లో ఒక వ్యక్తికి ఊబర్ బిల్లు 7 కోట్లు చూపించిందని చెప్పుకున్నామా...ఇప్పుడు బెంగళూరులో మరో వ్యక్తి అదే ఊబర్‌లో కోటి రూపాయల బిల్లు చూపించింది. బెంగళూరులో పనిచేస్తున్న తెలుగు వ్యక్తికి ఈ షాక్ తగిలింది. అతను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు 207రూ.లు ఛార్జి చూపించింది. తీరా రైడ్ అయ్యాక చూస్తూ మాత్రం కోటి ముప్ఫైలక్షల బిల్లు కనిపించింది. ఆటో అతను మొబైల్, కస్టమర్ మొబైల్ రెండింటిలోనూ అదే నంబర్ చూపించేసరికి ఇద్దరికీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు అంటున్నారు కస్టమర్. ప్రస్తుతానికి అయితే ఆటో డ్రైవర్‌కు 200 ఇచ్చానని..కానీ తరువాత ఏం అవుతుందో చూడాలని అంటున్నారు. ఎంత గ్లిచ్ అయిన 1CR రావడం ఏంది అయ్యా ఇది#uber #Bangalore pic.twitter.com/XTirUxsGwW — Trivikram JSP (@Trivikram_Pavan) April 2, 2024 Also Read:Elections 2024: డిఫరెంట్‌గా నామినేషన్…రూపాయి నాణేలతో దాఖలు #bengaluru #bill #uber #cab #one-crore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి