NEET: నీట్ పేపర్ లీక్‌లో కేసులో మరో ఇద్దరి అరెస్ట్.. నీట్ పేపర్ లీక్ విషయంలో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సీబీఐ. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకుంది. By Manogna alamuru 28 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి నీట్ పేపర్ లీక్ విషయంలో సీబీఐ చాలా సీరియస్‌గా ఉంది. కేంద్రం కూడా నిందితులను పట్టుకోవాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది. నీట్ పేపర్ లీక్ మాఫియాలో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన సీబీఐ ఈరోజు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్, సెంటర్ సూపరింటెండెంట్ ఇంతియాజ్‌లను అరెస్ట్ చేసింది. విచారణ కోసం సీబీఐ హజారీబాగ్‌లోని చార్హి గెస్ట్‌హౌస్‌కు వెళ్ళింది. అక్కడ నీట్ పరీక్ష జిల్లా కో-ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్ ఎహ్సాన్ ఉల్ హక్ ను మొదట అదుపులోకి తీసుకుంది సీబీఐ. ఆయనను విచారించింది. గత నాలుగు రోజులుగా హజారీబాగ్‌లో సీబీఐ బృందం నీట్ పేప్ లీక్ మీద దర్యాప్తు చేస్తూనే ఉంది. ఒయాసిస్ స్కూల్‌లో విచారణ అనంతరం ప్రిన్సిపాల్ ఎహసాన్ ఉల్ హక్‌ను సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు బీహార్ పలీసులు అరెస్ట్ చేసిన నిందితుల ఇంటిలో నుంచి సగం కాలిపయిన పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రశ్నపత్రం యొక్క ఫోటోకాపీలు కూడా ఉన్నాయి. దీని తర్వాత ఈ గం కాలిపోయిన పేపర్లను బీహార్‌లోని ఆర్థిక నేరాల విభాగానికి (EOU) అందించి.. అసలు ప్రశ్నపత్రంతో సరిపోల్చింది. ఇందులో సగం కాలిపోయిన పత్రాలలో 68 ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సమానంగా ఉన్నట్లు కనుగొనబడింది. తదుపరి విచారణలో పోలీసులకు దొరికిన ప్రశ్నపత్రాలు హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ బుక్‌లెట్‌తో సరిపోలినట్లు తేలింది. అప్పటి నుంచి ఒయాసిస్ స్కూల్‌పై సీబీఐ నిఘా పెట్టింది. ఈ విషయానికి సంబంధించి, ప్రిన్సిపాల్ ఎహ్సాన్ ఉల్ హక్ పై EOU అనుమానం వ్యక్తం చేసింది. విచారణ అనంతరం నేడు అరెస్ట్ చేశారు. Also Read:EPFO: ఈపీఎఫ్ఓల్లో పెరగనున్న టేక్ హోమ్ శాలరీ #arrest #cbi #neet #paper-leak మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి