Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటలకు ట్రాక్ మీద ఉన్న రైలును వెనుక నుంచి మరో రైలు ఢీకొనడంతో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.

New Update
Train Accident:విజయనగరం రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య

ఏపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం 14 మంది మృతిచెందగా, 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది. రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Kerala Bomb Blast: అది తట్టుకోలేకే క్రిస్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

మరోవైపు రైలు యాక్సిడెంట్ గురించి ముఖ్యమంత్రికి కేంద్ర రైల్వే మంత్రి ఫోన్‌ చేశారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయంఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం ఇచ్చేట్టుగా అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఘటనాస్థలానికి నిన్న రాత్రే మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకుని సమీక్షించారు. స్థానిక కలెక్టర్‌, ఎస్పీకూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆమేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.

రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుమారు 50 మంది వైద్యులతో చికిత్స చేస్తున్నారు. పలాస, రాయగడ ప్యాసింజర్ రైళ్ళల్లో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 14 అని చెబుతున్నా అక్కడ సహాయక చర్యల చేస్తున్న వారి మాటల ప్రకారం ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 40 నుంచి 50 వరకు ప్రయాణికులు మరణించి ఉండొచ్చని చెబుతున్నారు. పలాస రైల్లో గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైల్ ఇంజినులో ఉన్న లోకో పైలట్లు ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం విజయనగరం-కొత్తవలస ప్రధాన రహదారికి 5 కి.మీ పైగా దూరంలో ఉండటంతో అన్ని రకాల సహాయక చర్యలు కష్టమవుతున్నాయి. పైగా రాత్రి కూడా కావడంతో వెంటనే పెద్దగా ఏమీ చేయలేకపోయారు. నుజ్జయిన బోగీల నుంచి మృత దేహాలను బయటకు తీయడానికి కట్టర్లను ఉపయోగిస్తున్నారు.

రాయగడ ప్యాసింజర్ బయలుదేరిన గంటకే ప్రమాదం జరిగింది. ముందు వెళ్ళిన పలాస ట్రైన్ కు సిగ్నల్ సమస్య రావడం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఈరోజు కొన్ని రైళ్ళను రద్దు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు