Telangana Elections 2023: శనివారం బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే

శనివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌లు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

New Update
Telangana Elections 2023: శనివారం బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు పలు ప్రాంతాల్లో
పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
షెడ్యూల్ వివరాలు

ప్రధాని మోదీ..
రేపు ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.00PM కామారెడ్డికి చేరుకుంటారు. 3:00 PM గంటలకు మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పబ్లిక్ మీటింగ్‌ల‎లో పాల్గొంటారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..
రేపు 11:30 కొల్లాపూర్, 1:00 గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్‎చేరు, 5 గంటలకు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పబ్లిక్ మీటింగ్‎లలో పాల్గొంటారు

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా..
రేపు మధ్యాహ్నం 1.00 PM గంటకు హుజుర్‎నగర్ లో పబ్లిక్ మీటింగ్‎లో పాల్గొంటారు. 3:30 PM గంటలకు సికింద్రాబాద్, 5:00 గంటలకు ముషీరాబాద్ నియోజక వర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..
రేపు 11:00 AM గంటలకు సిరిపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే పబ్లిక్ మీటింగ్‎లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 PM గంటకు వేములవాడ నియోజకవర్గంలో జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. 2:30 PM గంటలకు సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే కార్నర్ మీటింగ్, సాయంత్రం 4:00 PM గంటలకు గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ కార్నర్ మీటింగ్‌లలో పాల్గొంటారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు