Telangana Assembly: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు..పవర్ పాయింట్ ప్రజెంటేషన్

తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఐదవరోజు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ఇవి మొదలవుతాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద ఈరోజు సభలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేయనుంది.

New Update
Telangana:నేడు ఆరవ రోజు బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదవరోజుకు చేరుకున్నాయి. మొదటిరోజు గవర్నర్ తీర్మానం చర్చ రోజునే సమావేశాలు వాడిగా వేడిగా సాగాయి. అధికార, ప్రతిపక్షాలు తగ్గేదేలే అన్నట్టు మాట యుద్ధం చేసుకున్నాయి. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలన్నీ బయటకు తీస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే...దేనికైనా సిద్దధం అంటోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశంలో గట్టిగానే వాగ్యుద్ధాలు జరుగుతాయని అనుకుంటున్నారు. ఈరోజు ఉదయం 11లకు ప్రారంభమయ్యే సభలో మొదటగా దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామన్నగారి శ్రీనివాస రెడ్డి, కొప్పుల హరీశ్వర్ రెడ్డి, కుంజా సత్యవతిలకు సభ సంతాపం తెలియజేయనున్నారు. దీని తర్వాత సభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీని వివరణ ఇవ్వనున్నారు. దీని కోసం అసెంబ్లీలో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. 2014 ఆదాయ, వ్యాయాల లెక్కలన్నీ పాయింట్ టూ పాయింట్ చెప్పనున్నారని తెలుస్తోంది. దీంతో ఈరోజు సభలో వాడిగా వేడిగా సమావేశాలు జరుగుతాయని అంచనా.

Also Read: బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

మరోవైపు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తరుఫున హరీష్ రావు లేఖ రాశారు. ఆర్ధిక, సాగునీరు, విద్యుత్ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు తమకూ కూడా ఇవ్వాలని ఆయన లేఖ లో కోరారు. కానీ ప్రభుత్వం దీనిని తిరస్కరించినట్టు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు