పూర్తిగా సైలెంట్ అయిన వైఎస్ షర్మిల.. అందుకేనా? వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అనూహ్యంగా పార్టీ పెట్టి.. అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు షర్మిల. పాదయాత్రలు మొదలు పెట్టి.. హాట్ కామెంట్స్ చేసి.. హాట్ టాపిక్ గా షర్మిల మారారు. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హైదరాబాద్ లో రచ్చ చేశారు. తెలంగాణలో సరికొత్త రాజకీయం పరిచయం చేసిన షర్మిల ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. By E. Chinni 24 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila) ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో అనూహ్యంగా పార్టీ పెట్టి.. అందరినీ తనవైపుకు తిప్పుకున్నారు షర్మిల. పాదయాత్రలు మొదలు పెట్టి.. హాట్ కామెంట్స్ చేసి.. హాట్ టాపిక్ గా షర్మిల మారారు. ప్రగతి భవన్ ముట్టడి పేరుతో హైదరాబాద్ లో రచ్చ చేశారు. తెలంగాణలో సరికొత్త రాజకీయం పరిచయం చేసిన షర్మిల ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయ్యారు. గత నెల, రెండు నెలలుగా ఆమె ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా.. కేవలం ట్విట్టర్(Twitter) కు మాత్రమే పరిమితమయ్యారు. ట్విట్టర్ ద్వారానే ట్వీట్లు చేస్తూ అప్పుడప్పుడూ వార్తల్లో నిలిచేవారు. ఈ మధ్య అదీ లేదు. అయితే ఇందుకో కారణం ఉందని తెలుస్తోంది. మొత్తం వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీ(Congress Party) లో విలీనం చేసేందుకేనని అని వైఎస్సార్టీపీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి రావడం.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్(Revanth reddy) కు అస్సలు ఇష్టం లేదని మరో టాక్ వినిపిస్తోంది. రేవంత్ ను కాదని కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేసేందుకు తెరవెనుక రాజకీయంలో బిజీగా ఉన్నారు షర్మిల. బెంగళూర్ వేదికగా ఆమే పావులు కదుపుతున్నారు. డీకే శివకుమార్ తో ఇప్పటికీ 4-5 సార్లు మంతలు పూర్తై.. ఢిల్లీలో రాహుల్ గాంధీనీ కలవడం కోసం ఎదురుచూస్తున్నారు. రాహుల్ అపాయింట్ మెంట్ దొరికితే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేందుకు సిద్దం అవుతున్నారు. అందుకే ఈలోపు ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకు షర్మిల సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది. #telangana #ys-sharmila #politics #sharmila #ysrtp #congress-party #ysrtp-chief-ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి