Mudragada: నూతన నామకరణ మహోత్సవానికి ఆహ్వానం..ముద్రగడ పై మాస్ ట్రోలింగ్! జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడిస్తానని కాపు ఉద్యమ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆయన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. By Bhavana 15 May 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి AP: రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. చాలా మంది ఓటర్లు సోమవారం రాత్రి వరకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీలన్ని తమ గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వాస్తవానికి ఎన్నికల పోలింగ్ అనంతరం పిఠాపురం లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. గతంలో పవన్ కళ్యాణ్ రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఇక ఎవరు గెలుస్తారనే విషయం తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తానని కాపు ఉద్యమ, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలింగ్ ప్రక్రియలో పిఠాపురంలో గతంలో కంటే భారీగా పోలింగ్ జరగడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. పిఠాపురంలో 81 శాతం వరకు పోలింగ్ నమోదైందని జనసైనికులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ముద్రగడ పై ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. 'ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ఆహ్వాన పత్రికలో ''అందరికీ నమస్కారం.. నూతన నామకరణ మహోత్సవం కాపు సోదర సోదరీమణులందరికి ప్రత్యేక ఆహ్వానం అంటూ పేర్కొన్నారు. 2024 జూన్ 4న సాయంత్రం ఆరు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ఈ కార్యక్రమం'' అని ఆహ్వాన పత్రికలో తెలిపారు. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత, తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చారు, అతను మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందంటూ ఎద్దేవా చేశారు. కావున అందరూ వచ్చి ఈ వేడుకను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని జనసైనికులు కోరారు. గమనిక మీ ఉప్మా,కాఫీలు మీరే తెచ్చుకోవాలి అంటూ సెటైర్లు పేల్చారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also read: ఆళ్లగడ్డలో హై టెన్షన్.. అఖిల ప్రియే టార్గెట్! #pawan-kalyan #east-godavari #ycp #ap #janasena #politics #mudragada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి