Kiss Issue: కాబోయే భార్యకు ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి పందిట్లో చావబాదిన బంధువులు!

పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది.

New Update
Kiss Issue: కాబోయే భార్యకు ముద్దు పెట్టిన వరుడు.. పెళ్లి పందిట్లో చావబాదిన బంధువులు!

Marriage: పెళ్లి పందిట్లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఎంతో సంబురంగా జరుగుతున్న వివాహ వేడుకలో వరుడి ముద్దు చిచ్చు రేపింది. తనకు కాబోయే భార్యకు ప్రేమగా పెట్టిన ముద్దు తన ప్రాణాలమీదకు తెచ్చింది. చివరకు ఇరు కుంటుంబాలు కర్రలతో చావ బాదుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరమాల వేయగానే ముద్దు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్‌లోని ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు ఒకేసారి జరుపుతున్నాడు. ఇందులో మొదటి కూతురు పెళ్లి సజావుగా పూర్తి కాగా.. కొద్దిసేపటి తర్వాత మరో కూతురు పెళ్లి తంతు మొదలైంది. ఈ క్రమంలోనే వరమాల వేయగానే వధువుకు బహిరంగంగా ముద్దు పెట్టాడు వరుడు. అయితే ఈ వ్యవహారంపై వధువు బంధువులకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇరువర్గాల వారు పరస్పరం కర్రలతో దాడి చేసుకోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఎన్నికల ప్రచారంలోనే మోడీని చంపేస్తాం.. అగంతకుడి వార్నింగ్!

అయితే దీనిపై మాట్లాడిన పెళ్లి కూతురు తండ్రి.. తమ కూతురు నిరాకరిస్తున్నా బలవంతం చేశాడని వాపోయారు. అందరిముందు ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. వరుడు మాత్రం ఆమె అంగీకారంతోనే ముద్దు పెట్టుకున్నానని చెబుతున్నాడు. అయితే ముద్దు గొడవపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. కానీ కర్రలతో దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment