UPS Effect: UPS విధానంతో EPF, PPF, GPF నిబంధనలు మారతాయా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) మూడిటి మధ్య చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏకీకృత పెన్షన్ స్కీమ్ రాబోతుండడంతో.. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ ఆర్టికల్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు By KVD Varma 26 Aug 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి UPS Effect: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఇవి మూడు వేరు వేరని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మూడు ఫండ్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏకీకృత పింఛను పథకం ప్రకటించిన తర్వాత వీటిలో ఏమైనా మార్పులు వస్తాయా? వాటిపై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే అయోమయంలో చాలామంది ఉన్నారు. అందుకే ముందుగా ఈ మూడు ఫండ్స్ గురించి తెలుసుకుందాం. దేశంలోని అన్ని వర్గాల ఆర్థిక భవిష్యత్తును భద్రపరచడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది, వాటిలో ముఖ్యమైనది ప్రావిడెంట్ ఫండ్ (PF). సాధారణ పరిభాషలో వాటిని PF అంటారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఇవి మూడు వర్గాలకు చెందినవని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మూడు ఫండ్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) UPS Effect: పేరులోనే చెప్పినట్టు ఈ PF సాధారణ ప్రజల కోసం. భారతీయ పౌరుడు ఎవరైనా, ఉద్యోగం లేదా వ్యాపారవేత్త అయినా, దీని ప్రయోజనాన్ని పొందవచ్చు. దీన్ని పోస్టాఫీసుల్లో లేదా బ్యాంకుల్లో తెరవవచ్చు. ఇందులో ఏటా కనీసం రూ.500, గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. PPF 15 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. దానిని ఒక్కొక్కటి 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఇందులో కాంపౌండ్ ఇంట్రస్ట్ లభిస్తుంది. అంటే అసలు పెట్టుబడికి వడ్డీ మొత్తం కూడా యాడ్ అవుతుంది. దానిపై వడ్డీ కూడా లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం దానిపై 7.1% వడ్డీ ఇస్తోంది. ఇందులో, వార్షికంగా రూ. 1.5 లక్షల పెట్టుబడిపై ఆదాయపు పన్ను సెక్షన్ 80సి కింద మినహాయింపు కూడా లభిస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి(EPF) UPS Effect: 20 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న ప్రైవేట్ రంగ కంపెనీల ఉద్యోగుల కోసం EPF. ఇందులో ఉద్యోగి జీతంలో కొంత భాగాన్ని జమ చేసి, కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. అయితే, కంపెనీ వాటాలో కేవలం 3.67% మాత్రమే EPFకి వెళ్తుంది. మిగిలిన 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లో డిపాజిట్ అవుతుంది. పదవీ విరమణ తర్వాత, పిఎఫ్ మొత్తాన్ని ఉద్యోగులకు ఒకేసారి ఇస్తారు. అయితే ఇపిఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి EPFపై వడ్డీ రేటు 8.25%గా నిర్ణయించారు. ఇది అనేక ఇతర పొదుపు పథకాల కంటే కొంచెం ఎక్కువ. జనరల్ ప్రావిడెంట్ ఫండ్(GPF) UPS Effect: జీపీఎఫ్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. ఇందులో ప్రభుత్వ సంస్థల్లో ఏడాదిపాటు నిరంతరంగా పనిచేస్తున్న తాత్కాలిక, పర్మినెంట్ ఉద్యోగులకు ఎకౌంట్ ఓపెన్ చేస్తారు. ఉద్యోగులు తమ జీతంలో కనీసం 6% GPFలో జమ చేయాలి. పదవీ విరమణ తర్వాత, వారికి ఏకమొత్తం అందుతుంది. కానీ కొత్త పెన్షన్ స్కీమ్ యుపిఎస్ ప్రవేశపెట్టడంతో, ప్రధాన ప్రతికూలత ఏమిటంటే, కంట్రిబ్యూషన్ చెల్లించడానికి జిపిఎఎఫ్ వంటి నిబంధన లేదు. ఏకీకృత పెన్షన్ పథకం (UPS) UPS Effect: UPSలో హామీ ఇచ్చిన కుటుంబ పెన్షన్ కోసం కూడా ఒక నిబంధన ఉంది. ఉద్యోగి మరణిస్తే అతని కుటుంబానికి వెంటనే 60 శాతం పెన్షన్ అందచేస్తారని ఇందులో చెప్పారు. డియర్‌నెస్ అలవెన్స్ ప్రయోజనం అష్యూర్డ్ పెన్షన్, అష్యూర్డ్ కనిష్ట పెన్షన్, అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్‌పై అందుబాటులో ఉంటుంది. ఇది పారిశ్రామిక కార్మికులకు సంబంధించిన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఉంటుంది. ఈ పెన్షన్ పథకంలో, గ్రాట్యుటీతో పాటు, సూపర్‌యాన్యుయేషన్ పేమెంట్ కూడా చేస్తారు. ఉద్యోగి సూపర్‌యాన్యుయేషన్‌పై తగిన పేమెంట్ పొందుతారు. దీని కోసం, ఉద్యోగి ప్రతి 6 నెలల సర్వీస్‌ను పూర్తి చేసిన తర్వాత, జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 1/10 వంతు గ్రాట్యుటీకి జోడిస్తారు. ఈ చెల్లింపు ఉద్యోగి హామీ పెన్షన్‌పై ప్రభావం చూపదు. #pension-scheme #ups మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి