Tesla Price Cuts: ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..టెస్లా కార్ల ధరలు తగ్గింపు..ఎంతంటే?

టెస్లా కార్లపై ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అన్ని రకాల మోడల్ ధరలను సుమారు 2000డాలర్లు తగ్గించారు. చైనా తయారీ ఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. అమెరికాలో కార్ల ధరలు తగ్గించిన మస్క్..తాజాగా చైనాలోనూ తగ్గించింది.

New Update
Tesla Layoffs: ఎలాన్ మస్క్ టెస్లా సీనియర్ ఉద్యోగులకు షాక్ 

Tesla – Elon Musk :  అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారుదారి సంస్థ టెస్లా...చైనాలో అన్నిరకాల మోడల్ కార్ల ధరలను సుమారు 2000డాలర్ల మేర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చైనా తయారీఎలక్ట్రిక్ కార్ల ధరలు చౌకగా ఉండటంతో టెస్లా కార్లకు గిరాకీ తగ్గింది. చైనాలోనే కాదు ఇంతకుముందు అమెరికాలోనూ కార్ల ధరలను తగ్గించింది టెస్లా. ఇప్పుడు తాజాగా చైనాలో తగ్గించింది. టెస్లా కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ Y ప్రారంభ ధర బేస్ రియర్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ కోసం 42,990 డాలర్లు. లాంగ్ రేంజ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ల ధర వరుసగా డాలర్లు 47,990, 51,490డాలర్లు తగ్గించింది. అదే సమయంలో, మోడల్ S డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ ధర డాలర్లు 72,990, ట్రై-మోటార్ ప్లాయిడ్ వెర్షన్ ధర 87,990 డాలర్లు వరకు తగ్గించింది.

టెస్లా నార్త్ అమెరికా కూడా ఏప్రిల్ 30 తర్వాత అన్ని మార్కెట్లలో తన రిఫరల్ ప్రోగ్రామ్ ప్రయోజనాలను తొలగిస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో తెలిపింది. ఈ ప్రోగ్రామ్ కొత్త కొనుగోలుదారులు ఇప్పటికే ఉన్న కస్టమర్‌ల నుండి రిఫరల్‌ల ద్వారా అదనపు ప్రోత్సాహకాలను పొందడంలో సహాయపడింది. టెస్లా చాలా కాలంగా ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తోంది.ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ తయారీదారు ఇటీవల తన సైబర్‌ట్రక్‌కు యాక్సిలరేటర్ పెడల్ లోపం కారణంగా రీకాల్ జారీ చేసింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కి దాఖలు చేసిన నివేదిక ప్రకారం, పెడల్ పైన ఉన్న యాక్సిలరేటర్ పెడల్ ప్యాడ్ వేరు చేయవచ్చు.

కాగా 2024 తొలి త్రైమాసికంలో గ్లోబ‌ల్ మార్కెట్లో టెస్లా కార్ల విక్రయాలు భారీగా ప‌డిపోయాయి. గ‌త 4ఏండ్లలో ఒక త్రైమాసికంలో కార్ల విక్రయాలు ప‌డిపోవ‌డం ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ చైనాలో టెస్లా త‌న కార్ల ధ‌ర‌లను త‌గ్గించ‌డానికి ప్రాధాన్యం ఏర్పడింది. పొదుపు చ‌ర్యల్లో భాగంగా ప్రపంచ‌వ్యాప్తంగా 10 శాతం సిబ్బందిని త‌గ్గిస్తామ‌ని గ‌త సోమ‌వారం ఎలాన్‌ మ‌స్క్ స్వయంగా ప్రక‌టించిన సంగతి తెలిసిందే. కార్ల విక్రయాల‌ను పెంచుకోవ‌డానికి లాభాలు త‌గ్గించుకోవ‌డానికి కూడా ఎలాన్‌ మ‌స్క్ వెనుకాడ‌టం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ధ‌ర‌ల త‌గ్గింపు వ‌ల్ల ప‌లు ద‌ఫాలు టెస్లా కార్ల షేర్ ప‌త‌న‌మైన విషయం తెలిసిందే. ఈ ఏడాది 40.8 శాతం మేర‌కు టెస్లా షేర్ న‌ష్టపోయిందని పలు నివేదికలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి:  చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. బీజేపీలోకి కీలక నేత?

Advertisment
Advertisment
తాజా కథనాలు