Skanda Movie Review:యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ.

రామ్ పోతినేని...ఇంతకు ముందు యాక్షన్ మూవీస్ చేసినా మరీ ఇంత ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా ఎప్పుడూ కనిపించలేదు. ఇంత వైలెంట్ గా అస్సలు కనిపించలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కంద మూవీలో రామ్ తనలోని మాస్ యాంగిల్‌ను మొట్టమొదటిసారి బయటకు తీశాడు. మరి బోయపాటి, రామ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా లేదా...ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? స్కంద మూవీ రివ్యూ.

New Update
Skanda Movie Review:యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ.

Skanda Movie Review in Telugu: బోయపాటి శ్రీను(Boyapati Sreenu), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్ లో వచ్చిన మూవీ స్కంద ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటించింది. అఖండ హిట్ తో మంచి ఊపు మీదున్న బోయపాటి రామ్ కు హిట్ ఇచ్చాడో లేదో తెలియాంటే రివ్యూలు చూడాల్సిందే.

కథః
ఏపీ సీఎం కూతురు పెళ్ళి జరుగుతుండగా.. తెలంగాణ సీఎం కొడుకు ఆ పెళ్ళి పిల్లను ఎత్తుకెళతాడు. దీంతో తెలంగాణ సీఎం కొడుకును టార్గెట్ చేసిన ఏపీ సీఎం అతన్ని చంపేదాకా నిద్రపోను అని ఛాలెంజ్ విసురుతాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కొడుకు నుంచి ఏపీ సీఎం కూతురుకు విముక్తి కలిగిందా..? ఇందులో స్కంద (రామ్) పాత్ర ఎంతవరకు ఉంది? ఈ సీఎంల వైరంలో స్కంద ఎందుకు ఎంటర్ అయ్యాడు? వాళ్ళతో స్కందకు ఉన్న సంబంధం ఏంటి? స్కంద ఎంటర్ అయ్యాక ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి అనేదే కథ.

ఎలా ఉంది...

మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్ అది తప్ప ఇంకేది తియ్యడు. స్కంద మూవీలో కూడా అదే రిపీట్ చేశాడు దర్శకుడు. రామ్ పోతినేనిని కూడా బాగానే హ్యాండిల్ చేశాడు. రామ్ లో ఉండే ఎనర్జీని మొత్తం ఫుల్గా వాడేసుకున్నాడు. కథ సంగతి ఎలా ఉన్న ఆకథనాన్ని మాత్రం పరుగులు పెట్టించాడు. కొన్ని సీన్లు అయితే అఖండను మించి వైలెంట్ గా ఉన్నాయి. కత్తి పట్టుకుని హీరో ఎడాపెడా నరుక్కుంటూ పోయాడు. సీఎంల కూతుర్లను ఎత్తుకెళ్ళిపోవడం లాంటి లాజిక్ లెస్ సీన్లు ఎలా పెట్టాడో అర్ధం కాలేదు. సీఎం సెక్యూరిటీని అంత ఈజీగా ఎలా తీసుకున్నాడో అర్ధం కాలేదు. ఇక విలనిజంలో బోయపాటి ఎప్పటిలానే తన మార్క ను చూపించాడు. శ్రీల గ్లామర్ తో సినిమాను కాస్త కాపాడింది. సినిమాలో సెంటిమెంట్ కూడా బాగా పండింది. యాక్షన్ తో పాటు ఎమోషన్ యాడ్ చేశారు బోయపాటి. ఆచార సంప్రదాయాలను చూపిస్తూ తీసిన కొన్ని బాగా పండాయి. ప్రీ క్లైమాక్స్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. చివరలో స్కంద ట్విస్ట్ సినిమాలో హైలైట్.

రామ్ శ్రీప్పటిలానే తన హై ఎనర్జీతో చించేశాడు. యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు అని పొగుడుతున్నారు సినిమా చూసినవాళ్ళు. రామ్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చును. శ్రీలీల ఉన్నంతసేపూ బాగానే ఉంది. రామ్, శ్రీలీలల డాన్స్ విజిల్స్ వేయించింది. విలన్స్ రోల్స్ బాగున్నాయి. ఆ పాత్రల్లో నటించిన వారు దానికి న్యాయం చేశారు. పాటలు అంత ఎక్కకపోయినా...బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మోత మోగించింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు అనిపించింది. మొత్తానికి సినిమా యావరేజ్ గా అనే చెప్పవచ్చును. బాలయ్య చరిష్మాతో అఖండ మిట్ అయినట్టు స్కంద మూవీ మాత్రం హిట్ అవ్వకపోవచ్చును. ఓన్లీ మాస్ ప్రేక్షకులను మాత్రమే థియేటర్లకు రప్పిస్తుంది స్కంద మూవీ. రామ్ కెరీర్ లో ఈ మూవీ యావరేజ్ గా నిలుస్తుందే కానీ హిట్ అవ్వదు.

Also Read: వైలెంట్ లుక్‌లో లవర్‌బోయ్…సూపర్ ఇంట్రస్టింగ్ గా యానిమల్ టీజర్…

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment