/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/yadadri.jpg)
Yadadri Photograph: (Yadadri)
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ్మస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా టీటీడీ తరహాలో పాలకమండలి ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాజాగా.. యాదగిరిగుట్ట ఆలయానికి 18 మంది సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.
ది తెలంగాణ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోదం తెలిపాయి. గవర్నర్ ఆమోద ముద్ర తరువాత.. పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.
Also Read: Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!
Yadagirigutta Temple
శాసనసభలో బిల్లుపై ప్రసంగించిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. 18 మందితో యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డును ఛైర్మన్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తామన్నారు. ఐఏఎస్ లేదా కమిషనర్ స్థాయి అధికారిని ఆలయ ఈవోగా నియమిస్తామని చెప్పారు. పాలకమండలికి పూర్తిగా స్వయంప్రతిపత్తి ఉంటుందని చెప్పారు.
శాశ్వత ధర్మకర్తలకు సభ్యత్వం, ఓటుహక్కు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఒక్కొక్కరు చొప్పున ఎస్సీ, ఎస్టీ, మహిళా సభ్యులను నియమిస్తామని.. బోర్డు కాలపరిమితి రెండేళ్లు ఉంటుందన్నారు.ప్రస్తుతం యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతి ఏడాది రూ.224 కోట్ల వార్షిక రాబడి వస్తుందని మంత్రి సురేఖ వెల్లడించారు. 1,241 ఎకరాల భూమి ఉందని.. దీన్ని ఆలయ నగరంగా మారుస్తున్నామన్నారు. టెంపుల్ సిటీ పరిధిలోకి మూడు మున్సిపాలిటీలతో పాటుగా మూడు గ్రామపంచాయతీలు, ఆరు గ్రామాలు వస్తాయన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట ఆలయ నగరంలో జంతువధపై పూర్తిగా నిషేధం ఉంటుందన్నారు. టీటీడీ తరహాలోనే.. జంతువులను వధించడం, మద్యం, మాంసం విక్రయాలు, లైసెన్స్ లేని విక్రయాలు, పాచికల ఆటలపై నిషేధం ఉంటుందని అధికారులు చెప్పారు. ట్రస్ట్ బోర్డు విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తుందని.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం, బోధించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. యాదగిరిగుట్టను మరింత అభివృద్ధి చేయాలని, భక్తులకు సౌకర్యాలు పెంచాలని బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!
Also Read: Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్‌వేర్ మృతి..!