/rtv/media/media_files/2025/01/30/vUWFLDCkpabnevMLID80.jpg)
pujitha, gopikrishna
ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లాయ్యాక మనోడి అసలు రంగు బయటపడింది. పెళ్లి చేసుకున్నాక నువ్వు నాకు వద్దంటూ తేగిసి చెప్పడంతో న్యాయం కోసం భర్త ఇంటిముందు తల్లిదండ్రులతో కలిసి దీక్షకు దిగింది భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ మండలం కలకోటకు చెందిన చేవల పూజిత (ఎస్సీ సామాజిక వర్గం) అదే మండలం బ్రాహ్మణపల్లిలోని తన మేనమామ ఇంటికి వెళ్తుండేది.
Also Read : పోలీస్ ఐతే ఏంటి.? స్టేషన్ లో బట్టలిప్పి అఘోరి హల్‌చల్
Love Marriage Issue
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గోపీకృష్ణ(బీసీ సామాజిక వర్గం)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమ (Love) గా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని గోపీకృష్ణ తన ఇంట్లో చెబితే.. కులాంతర వివాహానికి అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమికులిద్దరూ గ్రామ పెద్దలను ఆశ్రయించగా.. గతేడాది ఆగస్టు 28న ఖమ్మంలోని వేంకటేశ్వర స్వామి గుడిలో పెండ్లి చేశారు. అయితే అదే రోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్లి వస్తానని భార్యకు చెప్పి గోపీకృష్ణ వెళ్లిపోయాడు.
Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
15 రోజుల తరువాత ఇంటికి రమ్మని భార్య పూజిత కోరింది. ఇప్పుడు తాను అయ్యప్ప మాల ధరించానని.. అయిపోయిన తర్వాత తీసుకెళ్తానని చెప్పి మళ్లీ హైదరాబాద్ (Hyderabad) వెళ్లిపోయాడు. ప్రియుడి మాటలో తేడా కనిపించడంతో గట్టిగా నిలదీయగా.. నువ్వు నాకు వద్దంటూ తేగిసి చెప్పాడు గోపీకృష్ణ. దీంతో పూజిత పెద్ద మనుషులను ఆశ్రయించగా తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో చేసేది ఏమీ లేక తనకు న్యాయం చేయాలంటూ అత్తమామ ఇంటి వద్ద తల్లిదండ్రులతో కలిసి దీక్షకు దిగింది.
Also Read : దిగివచ్చిన మెటా..రూ.216 కోట్లు చెల్లించడానికి రెడీ!
/rtv/media/media_files/2025/01/30/NvseECvTUqdxDYy0Z7rw.jpg)
ప్రేమ పెండ్లి చేసుకుని ఇప్పుడు భర్త తనను వద్దంటున్నాడని పూజిత ఏడుస్తూ వాపోయింది. తన భర్త వచ్చేదాకా ఇక్కడే దీక్ష చేస్తానని పట్టుబట్టింది. కూతురిని పెండ్లి చేసుకున్న గోపీకృష్ణ ఆమెతో కాపురం చేయాలని పూజిత తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : టెన్త్ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్