/rtv/media/media_files/2026/04/30/fotojet-2026-04-30-13-52-47.jpg)
Extramarital Affair husband suicide
Extramarital Affair హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య వివాహేతర సంబంధాల కారణంగానే తాను తనువు చాలిస్తున్నట్లు సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. ఈ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి, నిందితులను కటకటాల వెనక్కి పంపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం (36) హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య రేణుక వెళ్లిపోయిందనే బాధతో ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, ఆయన చనిపోయే ముందు రాసిన సుదీర్ఘ లేఖలో భార్య అరాచకాలను పూసగుచ్చినట్లు వివరించారు. రేణుక కేవలం ఒక్కరితోనే కాకుండా, ఏడాదిన్నర కాలంలోనే ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధాలు కొనసాగించిందని సీతారాం ఆ లేఖలో పేర్కొన్నారు.
వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తులతో రేణుక ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డు చేసిందని, వాటిని రమణ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోలు చూసిన తర్వాతే తన భార్య అసలు స్వరూపం బయటపడిందని ఆయన లేఖలో రాశారు. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా, తప్పు తెలుసుకోవాల్సింది పోయి ఎదురు తిరిగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేదని సీతారాం వాపోయారు.
"నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదిస్తూ భార్యను ఎంతో అపురూపంగా చూసుకున్నాను. ఒక మధ్యతరగతి వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన పాపమా?" అంటూ సీతారాం తన లేఖలో వ్యక్తం చేసిన ఆవేదన అందరినీ కచివేస్తోంది. తన చావుకు భార్య ప్రవర్తనే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ 19 పేజీల మరణ వాంగ్మూలం సాక్ష్యంగా పోలీసులు రేణుకతో పాటు ఆమెకు సహకరించిన ప్రియులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన టెక్కీల జీవితాల్లోని మరో చీకటి కోణాన్ని బయటపెట్టింది.
Follow Us