Chief Secretary : తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు.. లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే!

తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు అనేదానిపై  ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవికాలం ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది.  దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్లు ప్రయత్నాలు చేస్తున్నారు.

New Update
Telangana new cs

Telangana new cs

తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు అనేదానిపై  ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి (CS Shanti Kumari) పదవికాలం 2025 ఏప్రిల్ 7వ తేదీతో ముగియనుంది.  దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్లు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్​ గోయల్​ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. మరి వీరిలో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుంది అన్నది చూడాలి.  

Also Read: Deep Seek: డీప్ సీక్ వెనుక అందమైన అమ్మాయి..టెక్ సంచలనం

1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి బీఆర్ఎస్ (BRS) హయాంలోనే సీఎస్​గా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆమె రికార్డు  సృష్టించారు.   2023 జనవరి 11న ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిగా బాధ్యత‌లు చేపట్టిన ఈమె 2025 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక సీఎస్ ను మార్చుతారన్న చర్చ నడించింది. కానీ  రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండా శాంతి కుమారినే ఆ పదవిలో కొనసాగించింది.  

Also Read: USA:బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్

New Chief Secretary Of Telangana

ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ 1992 బ్యాచ్ కు చెందినవారు.  ప్రస్తుతం ఈయన ఐటీ, ఇండస్ట్రీస్​ స్పెషల్​ సీఎస్​గా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా రెండున్నరేండ్ల సర్వీస్​ ఉంది.  1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ కు ఇంకా మూడేళ్ల సర్వీస్​ ఉంది.  ప్రస్తుతం ఈయన ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సాధారణ ఎన్నికల్లో ఈయన సీఈవోగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల సీఎస్ శాంతి కుమారి సెలవుపై వెళితే.. వికాస్​ రాజ్​కే తాత్కాలిక బాధ్యతలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  

Also Read :  భార్యపై అనుమానం..తనను చంపుతారేమోనని ఏం చేశాడంటే....

1990 బ్యాచ్​కు చెందిన సీనియర్​ ఐఏఎస్​ శశాంక్​ గోయల్​ కూడా సీఎస్ రేసులో ఉన్నారు.  ఇప్పుడున్న ఐఏఎస్​ల్లో అందరి కంటే ఆయనే సీనియర్.  ప్రస్తుతం ఎంసీహెచ్​ఆర్డీ డీజీగా పనిచేస్తున్నారు. ఈయన రిటైర్ కావడానికి ఇంకా ఏడాదిన్నర టైమ్ మాత్రమే ఉంది.  1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు ఈ ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం ఫైనాన్స్​ స్పెషల్​ సీఎస్​గా ఈయన కొనసాగుతున్నారు.

Also Read :  Love Marriage : ఎంతకు తెగించావ్రా .. లవ్ మ్యారేజ్ చేసుకుని చివరికి.. !

Advertisment
Advertisment
Advertisment