/rtv/media/media_files/kqkAqgHR5Wm8Fdds3jde.jpg)
Gandhi Bhavan
Congress MLC candidates : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు గడువు ఒకరోజు మాత్రమే ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఒక నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ లిస్టును ఈ రోజు సాయంత్రం వరకు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్ తో ఏఐసీసీ పెద్దలు ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. రాష్ర్ట నేతల అభిప్రాయం తీసుకున్న మీనాక్షి కాసేపట్లో హైకమాండ్ కు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నాలుగు సీట్లలో ఒకటి సీపీఐకి ఇచ్చే అవకాశం ఉండగా మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు పూర్తయింది. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: UP: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు!
ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ ( నల్గొండ డీసీసీ), నెహ్రూ నాయక్ (మహబూబాబాద్) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి అవకాశం లేదు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీల కోసం అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా శాసనసభలో కాంగ్రెస్‌కున్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి 4 దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీటిలో ఒకటి తమకు కేటాయించాలని సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌ను గట్టిగా కోరింది. సీపీఐ జాతీయ నేతలు దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా సంప్రదించినట్లు సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో కాకుండా భవిష్యత్తులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కొందరు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!
కాంగ్రెస్‌లో ఆశావాహులు ఎక్కువగా ఉండటం, ఒకరికి ఇస్తే మరొకరి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో నాలుగు సీట్లలోనూ తామే పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అవసరమైతే సీపీఐకి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేటాయించాలని చూస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కో సీటు ఇవ్వాలనే ప్రతిపాదన కాంగ్రెస్‌లో ఉంది. సీపీఐకి ఇవ్వకున్నా 4 వర్గాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ వర్గాలకు టికెట్ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సీపీఐ ఈ విషయంలో అంగీకరించకపోతే తప్పకుండా వారికి ఒక సీటు ఇవ్వాల్సిందే.