/rtv/media/media_files/2025/03/16/o8KxJh3rbkZEqSBkh2M6.jpg)
Tatikonda Rajaiah Photograph: (Tatikonda Rajaiah)
స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరగబోయే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. తాటికొండ రాజయ్య ఇంట్లో పోలీసులు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. రాజయ్య నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నాయి. ఈ సభకు ఆటంకం కలగకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులను ముందస్తు అరెస్ట్, హౌస్ అరెస్ట్ లు చేశారు.
Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఆదివారం రానున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్టేషన్‌ఘన్‌పూర్ శివారు శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు సీఎం రేవంత్ చేరుకుంటారు. వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను, ఇందిరా మహిళా శక్తి బస్సులను సందర్శిస్తారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.45.5 కోట్లతో ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రి, రూ.5.5 కోట్లతో నూతన డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారు.
Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది