/rtv/media/media_files/2025/02/26/slfa4oRNJxJbdyxAimH9.jpg)
Uttam Kumar Reddy
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాళ్లు ఎలా ఉన్నారు ? ఆరోగ్య పరిస్థితి ఏంటీ ? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read: తమిళనాడులో విజయ్ పార్టీని గెలిపిస్తా.. ధోని కంటే ఫేమసవుతా : ప్రశాంత్ కిషోర్
ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులను, టన్నెల్ ప్రమాదం జరిగినప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనే నిపుణులను తీసుకొచ్చి వాళ్ల సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతంగానే జరుగుతున్నాయన్నారు.
'' దెబ్బతిన్న టీబీఎంను గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి వేరుచేస్తాం. SLBC పూడికలోకి వెళ్లాలని.. మట్టి, నీరుతో పేరుకుపోయున్న సిల్ట్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించాం. ప్రకృతి విపత్తును కూడా రాజకీయం చేసి లబ్ధిపొందాలనుకునే వారి గురించి నేను మాట్లాడను. దేశ, విదేశాల్లో ఉన్నటువంటి టన్నెల్ నిపుణుల సూచనలో పనులు ముందుకు తీసుకెళ్తున్నాం. టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లని కాపడటమే మా లక్ష్యమని'' మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు.
Also Read: డీలిమిటేషన్ అలా చేస్తేనే మంచిది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలాఉండగా.. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది కుటుంబసభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పంజాబ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి కన్నీరుమున్నీరవుతూ వచ్చారు. వీరందరినీ ఓదార్చి, ధైర్యం చెప్పేందుకు ప్రభుత్వం ఒక అధికారిని నియమించింది. ఇందులో ఆపరేటర్‌గా పనిచేస్తున్న గురుప్రీత్ సింగ్ భార్య, ఇద్దరు కూతుళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కుటుంబాన్ని వదులుకుని ఇంత దూరం వస్తే ఇలా జరిగిందంటూ బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!