పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో LPG కొరత ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సరఫా కొంత వరకు మాత్రమే ఆగినట్లు తెలిపారు. సూర్యాపేటలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ కొరతపై శుక్రవారం చమురు కంపెనీలతో సమీక్షిస్తామని తెలిపారు.
Also Read: LPG ధరల పెరుగుదలపై రాజకీయ దుమారం.. కేంద్రం క్లారిటీ
ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేయించే బాధ్యతలు తీసుకుంటామని తెలిపారు. డీలర్లు ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
Also Read: యుద్ధం ఆపడానికి అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు.. అవేంటో తెలుసా?
రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నాకూడా సరిపడా గ్యాస్ తీసుకురావడం లేదని మండిపడుతున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ఎరువుల కొరత కూడా ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
LPG Crisis: గ్యాస్ కొరత.. బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో LPG కొరత ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో హోటళ్లు మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Uttam Kumar reddy