/rtv/media/media_files/2025/03/03/J4U5qBxCxuwBNJ07R07d.jpg)
UPI Payments in RTC Buses
బస్సు ప్రయాణికులకు కండక్టర్‌తో తరచుగా చిల్లర సమస్య ఎదురుతుంటుందనే సంగతి తెలిసిందే. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నప్పటికీ పురుష ప్రయాణికుల్లో చిల్లర సమస్య మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు చిల్లర సమస్య లేకుండా ఉండేందుకు యూపీఐ పేమెంట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్సులో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. త్వరలోనే రాష్ట్రమంతటా విస్తరించనున్నారు.
Also Read: రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆర్టీసీ బస్సుల్లో అధికారులు ప్రత్యేక మిషిన్స్‌ను తీసుకొచ్చారు. దీని సాయంతో ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంటర్ చేయగానే ఆ మిషన్ స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ కనపిస్తుంది. అప్పుడు ప్రయాణికులు దాన్ని స్కాన్ చేసి ఫోన్‌తోనే పేమెంట్స్ చేయొచ్చు. అయితే ఈ విధానం వల్ల కూడా సిటీ బస్సుల్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి. స్టాపులు దగ్గరగా ఉండటంతో బస్సుల్లో రద్దీ వల్ల ప్రయాణికులు స్కానింగ్ చేసేందుకు ఆలస్యమవుతోందని కండక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు పలుచోట్ల బస్సుల్లో సరిగా సిగ్నల్స్ లేకపోవడం వల్ల పేమెంట్ ఆలస్యమవుతుందని అంటున్నారు.
Also Read: మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే
అయితే భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలు అందించేందుకు ఆర్టీసీ సన్నహాలు చేస్తోంది. కొన్నిబస్సుల్లో ఇప్పటికే స్వైపింగ్ మిషన్ ఉంది. రాబోయే రోజుల్లో బస్‌పాస్‌ను కూడా మొబైల్‌లో చూపించే రోజులు రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు బస్‌పాస్ రెన్యువల్ కోసం ప్రతినెల క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలోనే బస్‌పాస్‌ను ఆన్‌లోనే అందించేలా ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది. దీనికోసం త్వరలో ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది .
Also Read: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
Also Read: సంగారెడ్డిలో దారుణం.. ఆస్తి కోసం తల్లిని 20 సార్లు పొడిచి.. ఆ కసాయి కొడుకు ఏం చేశాడంటే?