Kishan Reddy: సినిమాల పేర్లు తెలుగులో ఉండాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడటం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని అన్నారు. కోర్టులో వాదనలు, తీర్పులు తెలుగులోనే ఉండాలని.. సినిమాల పేర్లు కూడా తెలుగులో ఉంటే బాగుటుందని అన్నారు.

New Update
Kishan Reddy

Kishan Reddy

హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలుగు మహాసభలు కొనసాగతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఈ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాట్లాడటం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని అన్నారు. పిల్లలతో బాలసాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాషను క్రోడీకరించి రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.  

Also Read: మల్లారెడ్డి కాలేజీ సీజ్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

అలాగే డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధికి, సంరక్షణకు దోహదం చేయాలని తెలిపారు. ప్రస్తుతం వికీపీడియాలో కూడా తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. వ్యాసాలు, కథలు, కథనాలు ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు భాష కనుమరుగు కాకముందే దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అధికార, పాలన వ్యవహారాలు తెలుగులోనే జరగాలని తెలిపారు. 

Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

'' కొత్త సాంకేతిక, కార్యక్రమాలను కూడా మాతృభాషలోనే చెపట్టాలి. వాడుక భాషల్లో చూసుకుంటే 30 శాతం మాత్రమే తెలుగులో ఉంది. 70 శాతం ఆంగ్ల పదాలే ఉంటున్నాయి. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటుంది. పిల్లలందరికీ కూడా ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలి. న్యాయస్థానాల్లో వాదనలు, ప్రతివాదనలు కూడా తెలుగులోనే ఉండాలి. కోర్టు తీర్పులు తెలుగులోనే ఉండాలి. అలాగే సినిమాల పేర్లు కూడా తెలుగులోనే ఉంటే బాగుంటుందని'' కిషన్ రెడ్డి అన్నారు.  

Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!

Also Read: ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రధాన నిందితుడి పాస్‌పోర్ట్‌ రద్దు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ రద్దు అయ్యింది. పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు.

New Update
 Phone Tapping Case

 Phone Tapping Case

 Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు పాస్‌పోర్ట్‌ రద్దు అయ్యింది. పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి అమెరికా పారిపోయిన ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ కావడంతో పాస్ పోర్టు అథారటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్‌కార్డు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంలోనే పాస్ పోర్ట్‌ను జప్తు చేస్తున్నట్లు  పాస్‌పోర్టు అథారిటీ ప్రకటించడంతో గ్రీన్‌కార్డ్ లభించలేదని తెలిసింది. మరోవైపు అమెరికా కాన్సులేట్, కేంద్రం సహకారంతో ప్రభాకర్ రావు ను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Also Read:  chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ పోలీసులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న శ్రవణ్‌రావును పోలీసులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనను హైదరాబాద్‌కు రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ  ఆ ప్రయత్నాలేవి ఫలించలేదు. పైగా ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వస్తా అంటూ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావు పాస్ట్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లిన ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయినప్పటి నుంచి అక్కడే తలదాచుకున్నారు. గతంలో చాలా సార్లు నోటీసులు ఇప్పించినప్పటికీ ప్రభాకర్ రావు ఇండియాకు రాలేదు.. విచారణకు సహకరించలేదు.

Also read : శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
 
దీంతో తెలంగాణ సీఐడీ నుంచి సీబీఐకి లేఖ రాసి.. సీఐబీ ద్వారా ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్‌కార్నర్‌ నోటీసును జారీ చేశారు. రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును జప్తు చేస్తున్నట్లు ఇప్పటికే పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో పాస్‌పార్ట్‌ను ప్రభాకర్‌ రావు సమర్పించాల్సి ఉంటుంది. కానీ హాండోవర్ చేయకుండా పాస్‌పోర్టును తన వద్దే పెట్టుకోవడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభాకర్‌ రావు పాస్‌పోర్టును రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్‌రావును హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు.

Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన పాస్‌పోర్టు రద్దు అయ్యింది. ముఖ్యంగా పాస్‌పోర్టును జప్తు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో అమెరికాలో స్థిరపడాలని అనుకుంటున్నానని ప్రభాకర్‌రావు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్‌పోర్టు రద్దు అవడంతో గ్రీన్‌కార్డు కూడా రిజెక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వేరే దేశానికి వెళ్లాలని అనుకున్నా, ఇండియాకు రావాలనుకున్న వీలులేదు. అమెరికాలో ఉన్న అధికారులు.. ప్రభాకర్‌రావును ఇంటర్‌పోల్‌కు అప్పగిస్తే.. ఇంటర్‌పోల్‌ సహాయంతో హైదరాబాద్‌కు రప్పేందుకు ఇక్కడి పోలీసులు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేశారు.

Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

Advertisment
Advertisment
Advertisment