/rtv/media/media_files/2025/03/13/FLcPG5dGSk2mXAXBv2hD.jpg)
Two young women reels videos on road were chased by stray dogs
ఈ మధ్య కాలంలో రీల్స్ పిచ్చి ఎక్కువైపోయింది. గుడి, బడి, బస్సు, ట్రైన్, బైక్, ఆటో, హాస్పిటల్, హాస్టల్ ఇలా ఎక్కడబడితే అక్కడ.. ఎలా బడితే అలా రీల్స్ మోజులో యువత వీడియోలతో రెచ్చిపోతుంది. పొద్దున్న లేచిన్నుంచి రాత్రి పడుకునే వరకు అదే ద్యాసలో ఉంటున్నారు. రాత్రి, పగలు అనే తేడా కూడా లేకుండా రీల్స్ మోజులో పడి సమస్యల్లో చిక్కుకుంటున్నారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Dog Videos
తాజాగా అలాందే ఒక సంఘటన జరిగింది. ఓ ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేసే సమయంలో భయబ్రాంతులకు గురయ్యారు. వీడియో ఆన్ చేసి పెర్ఫార్మెన్స్ ఇచ్చే సమయంలో వీధి కుక్కలు వారిపై దాడికి పాల్పడ్డాయి. వెంటనే వారు పరుగులు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
Dogs Chased away Girls who were making Reels on Middle of the Road: pic.twitter.com/cKSSK93Hmm
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 12, 2025
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
రాత్రి సమయంలో ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేద్దామని రోడ్డుపైకి వచ్చారు. అక్కడే ఒక బైక్‌పై ఫోన్ పెట్టి వీడియో ఆన్ చేశారు. ఆపై రెండు మూడు పోజులు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో వీధి కుక్కలు పరుగు పరుగున వారి వద్దకు వచ్చాయి. దీంతో అది గమనించిన ఆ ఇద్దరు యువతులు పరుగులు తీశారు. వారిని తరుముతూ ఆ కుక్కలు వెంటపడ్డాయి. అదంతా వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.