Medchal Murder: మేడ్చల్ మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్

మేడ్చల్ ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద యువతిని దారుణంగా హత్య చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతదేహం పక్కన పసుపు, కుంకుమ ఆనవాళ్ళు కనిపించడంతో...క్షుద్రపూజలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
TS

Medchal Young Woman Murder

 మేడ్చల్ లో యువతి  మర్డర్ పోలీసులకు సవాల్ గా మారింది. హత్య జరిగి 24 గంటలు గడిచినా ఒక్క ఆధారం కూడా లభించలేదు. నిందితులు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కుండా చాలా పక్కాగా పలాన్ చేసి మరీ ర్డర్ చేశారు. దానికి తోడు బాడీని తగులబెట్టడం వల్ల కూడా ఆనవాళ్ళు లభించడం లేదు. పైగా సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో హత్య చేశారు. అయితే ఒంటిపై ఉన్న పూసలదండ, జడ పిన్నీసులు మాత్రం ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మహిళలు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. దాని ద్వారా ఆ మహిళ ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీఎస్‌ పోలీసులు, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..

క్షుద్రపూజలు చేశారేమో..

మరోవైపు యువతి మర్డర్ కు సంబంధించి మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతి శరీరం క్కన పసుపు, కుంకుమను పోలీసులు గుర్తించారు.  దీంతో క్షుద్రపూజలు చేసి అమ్మాయిని చంపేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటూ తెలంగాణతో పాటూ ఇతర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. 

ఓఆర్ఆర్ కాజ్ వే కింద ఆమెను పడేసిన రెండు గంటల తర్వాత మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆమె మొహం మీద దుండగులు చితకబాదారు. కొంచెం కూడా ఆనవాళ్ళు కనిపించడం లేదు. దానికి తోడు ఆమెను కాల్చి పడేశారు. అది కూడా చాలా వికృతంగా చేశారని తెలుస్తోంది. పెట్రోల్ లేదా కిరసనాయిల్ తో మృతదేహాన్ని కాల్చడం కాకుండా చిన్న లైటర్ తో ఆమె ముఖాన్ని కాల్చారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యువతిని దుండగులు రేప్ చేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆమె ప్రవైటు పార్ట్ దగ్గర బట్టలు సరిగ్గా లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. 

Also Read: చెన్నై ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు..హై టెన్షన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad : నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా..టోల్ సిబ్బందిపై దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి రెచ్చిపోయాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. 

New Update
Attack on toll staff

Attack on toll staff

Hyderabad : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి రెచ్చిపోయాడు. అతనితో పాటు కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు. 

Also Read: America Earth Quake: అమెరికా.. శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం

టోల్‌ సిబ్బంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్‌బండ్‌కు చెందిన హుస్సేన్‌ సిద్ధిక్‌ సర్వే ఆఫ్‌ ల్యాండ్ రికార్డుల్లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి వచ్చాడు. రాజేంద్ర నగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నెంబర్‌ 17 వద్ద ఎగ్జిట్‌ అవుతుండగా టోల్ సిబ్బంది డబ్బులు అడిగారు. తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని హుస్సేన్ సిద్ధికి టోల్ సిబ్బందిని కోరాడు. అయితే ఆ కారుకు టోల్ మినహాయింపు లేకపోవడంతో డబ్బులు చెల్లించాలని టోల్ సిబ్బంది తెలిపారు. మీకు టోల్‌ మినహాయింపు ఉండదని.. కచ్చితంగా టోల్‌ ఫీ చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. దీంతో సిబ్బందిని పట్టించుకోకుండా హుస్సేన్‌ సిద్ధిక్‌ కారును పక్క నుంచి పోనిచ్చేందుకు ప్రయత్నించాడు.

Also Read:Bangladesh: నిప్పుతో గేమ్స్‌ వద్దు.. యూనస్‌కు హసీనా వార్నింగ్

అది గమనించిన టోల్‌ సిబ్బంది.. సిద్దిక్‌ కారును ఆపారు. దీంతో హుస్సేన్ సిద్ధి ఒక్కసారిగా కోపంతో ఉగిపోయాడు. ఆగ్రహించిన సిద్దిక్‌ కుటుంబసభ్యులు టోల్‌ సిబ్బందిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో టోల్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. టోల్ గేట్‌ ఎగ్జిట్‌ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు.

Also  Read: America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!

 

Advertisment
Advertisment
Advertisment