/rtv/media/media_files/2026/05/19/trump-says-he-called-off-new-iran-attack-at-request-of-gulf-states-2026-05-19-09-41-25.jpg)
Trump says he called off new Iran attack at request of Gulf states
ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసేందుకు ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్.. ముందస్తుగా ప్లాన్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సైనిక దాడుల నిర్ణయాన్ని ఆయన తాత్కాలికంగా పక్కన పెట్టారు. గల్ఫ్ దేశాల అధినేతల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు తాను వెనకడుగు వేసినట్లు తన 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు. ప్లాన్ ప్రకారం మంగళవారం రోజున ఈ దాడులు జరగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మిత్రదేశాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రస్తుతం ఇరాన్‌తో అత్యంత కీలకమైన చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో దాడులను వాయిదా వేయాలని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల అగ్రనేతలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఇరాన్‌పై ప్రయోగించాల్సిన దాడులను ఆపాలని రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు యూఎస్ సైనిక దళాలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై ఎన్నడూ లేని విధంగా విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు.
Also Read: ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక
అయితే ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందంలోనైనా.. ఆ దేశంలో అణ్వాయుధాలు ఉండకూడదనేది అమెరికా ప్రధాన డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు హర్మూజ్ జలసంధి భద్రత, అణు కార్యక్రమాల నియంత్రణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ సంక్షోభాన్ని ముగించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ పంపిన 14 పాయింట్ల సవరించిన శాంతి ప్రణాళికను కూడా పంపించింది. కానీ ట్రంప్ దీన్ని ఇప్పటికే తిరస్కరించారు.
ఇదిలాఉండగా అమెరికాతో ప్రస్తుతం దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము చర్చల కోసం ముందుకు రావడం అంటే అమెరికాకు లొంగిపోయినట్లు కాదని పేర్కొన్నారు. తమ సార్వభౌమత్వాన్ని, ప్రజల హక్కులను కాపాడుకుంటూనే ఈ చర్చల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ హక్కుల విషయంలో వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు.
Follow Us