/rtv/media/media_files/2025/03/03/ihXOhJz8tk1PAj1CAtfJ.jpg)
Addanki Dayakar
అద్దంకి దయాకర్ (Addanki Dhayakar).. తెలంగాణ పాలిటిక్స్ (Telangana Politics) లో ఈ పేరు తెలియని వారు ఉండరు. టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో ఆయన దక్కాల్సిన తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ను మరొకరికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత దయాకర్ కు తగిన పదవి ఇస్తామని ఆ సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా దయాకర్ కు ఏ పదవి రాకపోవడంపై తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Addanki Dayakar met Janareddy & Komatireddy
— Congress for Telangana (@Congress4TS) March 3, 2025
మాజీ మంత్రి జానారెడ్డి మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్@ADayakarINC pic.twitter.com/THfs6R695O
Also Read : అయ్యో.. ఆ రాక్షడు నా చెల్లిని కొట్టి చంపాడు.. మలక్‌పేట శిరీష కేసులో బిగ్ ట్విస్ట్!
కొందరు కాంగ్రెస్ నేతలే ఆయనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారన్న చర్చ కూడా ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో మళ్లీ అద్దంకి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి ఆయనకు పదవి పక్కా అన్న ప్రచారం సాగుతోంది. అద్దంకి కూడా ఈ సారి తనకు ఎమ్మెల్సీ సీటు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలు టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నారు.
Also Read : తణుకులో అఘోరీ సంచలనం.. వాన్ని చంపేస్తానంటూ బీభత్సం!
వరుసగా నేతలతో భేటీ..
గత వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో అద్దంకి దయాకర్ రెండు సార్లు భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ సీటు విషయమై సీఎంతో అద్దంకి చర్చించినట్లు తెలుస్తోంది. అయితే.. తన ప్రయత్నం తాను చేస్తానని అద్దంకితో సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై వారి మద్దతు కూడా తీసుకోవాలని రేవంత్ సూచించినట్లు చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో దయాకర్ సమావేశం అయ్యారు. మినిస్టర్ క్వార్టర్స్ లో జరిగిన ఈ భేటీలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కేందుకు సహకరించాలని కోరినట్లు సమాచారం. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read : KKR కొత్త కెప్టెన్ ఇతడే.. ప్రకటించిన ఫ్రాంచైజీ