తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్ సినీ ప్రముఖుల మధ్య సమావేశం వాడీవేడీగా సాగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. దీని అనంతరం సినీ ప్రముఖులు కొందరు కొన్ని అభ్యర్థనలను సీఎం రేవంత్ ముందు ఉంచారు. ముందుగా దర్శకుడు రాఘవేంద్రరావు కొన్ని అభ్యర్థనలు చేశారు. ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు! రాఘవేంద్రరావు ఏమన్నారంటే? రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం కూడా తమని బాగా చూసుకుంటోందని తెలిపారు. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారని.. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నాం అని అన్నారు. ALSO READ: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూ లైన్‌కు స్వస్తి! ఆ ఘటన తమని ఎంతగానో బాధించింది అలాగే నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటన తమని ఎంతగానో బాధించిందని తెలిపారు. సినిమా రిలీజ్‌లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఇవే టాలీవుడ్‌కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇవాళ సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని.. టికెట్ రేట్ల పెంపు జరగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్‌కి పూర్తి మద్దతుగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. అనంతరం సంధ్య థియేటర్ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్ స్వాప్ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు! రాజీ పడేది లేదు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే.. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్‌గా తీసుకుందని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇకపై బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటామని అన్నారు. అంతేకాకుండా అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని పేర్కొన్నారు. ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు? ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ రైజింగ్‌లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలని పేర్కొన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని చెప్పారు. ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.