/rtv/media/media_files/2025/01/09/scKNB8B3NMuFvZqnjaJx.jpg)
tgsrtc buses Photograph: (tgsrtc buses )
రెండు రోజులుగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్ళే బస్సులు, ట్రైన్‌లు,ఫ్లైట్‌లు అన్నీ రద్దీగా ఉంటున్నాయి. వేటిల్లోనూ ఖాళీలు లేవు. రేట్లు పెంచి బస్సులు నడుపుతున్నా...జనాలు ఎక్కడా తగ్గడం లేదు. పండుగకు ఇంటికి వెళ్ళడమే ముఖ్యమని అనుకుంటున్నారు. ప్రవైటు బస్సులు విపరీతంగా ఛార్జీలను పెంచేశాయి.ఈ కారణంగా చాలా మంది ఆర్టీసీ బస్సులను బాట పడుతున్నారు. దీంతో ఆర్టీసీకి కాసుల వర్షం కురుస్తోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే ఐదు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెబుతున్నారు.
6 వేలకు పైగా...
ఈ పండుగల్లో టీజీఎస్ ఆర్టీసీ మొత్తం 6,432 బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే వేలకు పైగా బస్సులు నడిపింది. మిగతా రెండు రోజుల్లో మరిన్ని బస్సులను నడుపతామని చెప్పింది. అయితే మరో కొన్ని గంటలపాటు రద్దీ కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక మూడేళ్ల తర్వాత జనవరి 14న మకర సంక్రాంతి రాబోతోంది. ఇదే సమయంలో 19 ఏళ్ల తర్వాత మరో అరుదైన ఘటన కూడా వస్తోంది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగతో పాటు భౌమ పుష్య యోగం కూడా రాబోతుంది. ఈ యోగంలో ఏ పని తలపెట్టిన కూడా అంతా విజయమే లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకున్నారు. మళ్లీ ఇప్పుడు అదే తేదీన పండుగను జరుపుకుంటున్నారు. జనవరి 14వ తేదీన ఉదయం 8.56 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ఏవైనా శుభ కార్యాలు తలపెట్టిన అన్నింటా విజయమే లభిస్తుంది. నర్మదా, గంగా వంటి పుణ్య నదుల్లో కూడా ఈ సమయంలోనే స్నానం చేస్తారు.