/rtv/media/media_files/2025/01/21/v3ASNxJ2aydebZJcMENW.jpg)
TGRTC Photograph: (TGRTC)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎలక్ట్రికల్ బస్సులు బస్సులు సంఖ్య పెరుగుతుంది. మొత్తం 500 బస్సుల్లో ఇప్పటికే 150 ఎలక్ట్రికల్ బస్సులు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ సరఫరా చేసింది. వరంగల్ 2 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు, హైదరాబాద్‌లో 1 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులను TGRTCకి సప్లై చేస్తోంది. త్వరలో మిగిలిన డిపోలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.
Also read: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం
మరో కీలక నిర్ణయం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ ఆర్టీసీ డిపోలు ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ బస్సులను సరఫరా చేసిన జేబీఎం సంస్థకు డిపోలు అప్పగించాలని రోడ్డు రవాణ సంస్థ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం
ప్రైవేటు సంస్థ చేతికి డిపోలు వెళ్తే తమ ఉద్యోగాలు పోతాయన్న భావనలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెరుగుతాయని తెలంగాణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.