/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T162538.691.jpg)
TGPSC released Group 1 General Ranking List
TGPSC: గ్రూప్1 అభ్యర్థులకు అలర్ట్. జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో దీన్ని అందుబాటులో ఉంచింది. 2024 అక్టోబర్‌లో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి మార్చి 10న ప్రొవిజినల్ మార్కులు విడుదల చేసింది.
పారదర్శకంగానే నియామక ప్రక్రియ..
ఇదిలా ఉంటే.. గ్రూప్- 1 ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారాన్ని TGPSC ఖండించింది. 'అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారమని తెలిపింది. గ్రూప్ -1 నియామక ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుదని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అభ్యర్థులు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.
Also read : సింగర్ కల్పన ఆత్మహత్యకు అదే కారణం.. షాకింగ్ విషయాలు
అసలేం జరిగిందంటే..
తెలంగాణలో గ్రూప్ -1 పోస్టులు అమ్ముకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఒక్కో పోస్ట్ కు రూ. 4 కోట్ల డిమాండ్ చేస్తున్నారని, వేరు వేరు హాల్ టికెట్లు ఇవ్వడం వెనక రహస్యం అదేనంటూ ప్రచారం జరుగుతోంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరిగి ఇప్పటికి 5 నెలలు గడిచింది. ఇప్పటి వరకు ఫలితాల మీద ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ లో జరగగా, మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబర్ చివర్లో నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడం పై మెయిన్స్ రాసిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు.
Also read : చైనా AI డీప్‌సీక్ కారణంగా మస్క్‌కు 90 బిలియన్ డాలర్ల నష్టం
group-1 | result | telugu-news