/rtv/media/media_files/2025/03/15/VcRBAmQtmHgiNUVE7nPL.jpg)
Kommala Narasimha Swamy Jathara
Warangal : హోలీ పర్వదినాన వరంగల్ జిల్లాలో నిర్వహించే కొమ్మాల జాతర ఫుల్ ఫేమస్.. కానీ ఆ జాతరలో రాజకీయ ప్రభ బండ్ల ఆధిపత్య ప్రదర్శన హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. రెండు దశాబ్దాల తర్వాత మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రభబండ్లు ఎవరికి వారు ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అధికార పార్టీలో ముగ్గురు నేతల గ్రూప్ వార్ తో సై అంటే సై అని ప్రభలతో పోటీపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ కూడా తగ్గేదే లే అన్నట్లు ప్రభలను ప్రదర్శించారు.
ఇది కూడా చూడండి:Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
జాతర ప్రభల బండ్ల ర్యాలీలో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు ఎదురుపడడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా పార్టీల ప్రభ బండ్లతో బలప్రదర్శన చేయడంతో ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది. కొమ్మాల జాతరకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ప్రభలతో వేలాది మంది కార్యకర్తలు గిర్నిబావి సెంటర్లో ఒక్కసారిగా చేరుకున్నారు, పోలీసులు అదుపు చేస్తున్నా వినకపోవడంతో లాఠీ ఛార్జ్ చేశారు. లాఠీ ఛార్జ్ లో ఏసీపీ కిరణ్ కుమార్ స్వయంగా ఉండటం గమనార్హం.
ఇది కూడా చూడండి: Tushar Gandhi: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...
హోలీ పౌర్ణమి రోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా వైభవంగా జాతర జరుగుతుంది. ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం వైభవంగా జాతర నిర్వహించారు.. జాతరకు వేలాదిమంది ప్రజలు తరలి వచ్చారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పులకరించి పోయారు. అయితే జాతర సందర్భంగా రాజకీయ పార్టీల ప్రభ బండ్ల ప్రదర్శన టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మూడు వర్గాలు ఉద్రిక్తతకు కారకులయ్యారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి, ఆలయ చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి నేతల వర్గాలు పోటాపోటీగా ఆధిపత్య ప్రదర్శనకు దిగారు. బారీ ప్రభలతో జాతరకు ఫుల్ జోష్ తీసుకువచ్చారు. ఇందులో కొండా వర్సెస్ రేవూరి రెండు వర్గాలు పోటీ పడడంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారింది.. పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లు జరగకుండా అదుపు చేశారు.
Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్వయంగా ప్రభ బండి నడుపుకుంటూ జాతరకు తరలివచ్చారు. మరోవైపు కొండా మురళి తన అనుచర వర్గంతో హడావుడి చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతరలో హై టెన్షన్ క్రియేట్ అయ్యేలా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రభలు కూడా తగ్గేదెలే అన్నట్లుగా భారీ ఎత్తున తరలి వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల నుండి తరలివచ్చిన బీఆర్ఎస్ ప్రభలు కొమ్మల జాతరలో ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి హల్చల్ చేశారు. అయితే ఈ ప్రధాన రాజకీయ పార్టీల ప్రభావాలు ఇక్కడ ఎదురుపడకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ ఉద్రిక్తత తప్పలేదు. దీంతో లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది.ఎప్పుడు కనిపించని బీజేపీ కూడా ఈసారి మేం కూడా తగ్గేది లేనట్టుగా ప్రభబండ్లతో కదిలి వచ్చి ఇక్కడ ఆధిపత్య ప్రదర్శనకు దిగారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
అయితే గతంలో ఈ ప్రభ బండ్ల ప్రదర్శన హత్యలకు దారి తీయడంతో పోలీసులు కొంతకాలం నిషేధం విధించారు. ఆ తర్వాత మళ్లీ గత జాతర నుండి రాజకీయ పార్టీల సందడి మొదలైంది. ఈసారి ఎవరికి వారు తగ్గేదెలే అన్నట్లుగా పోటాపోటీగా ప్రభలతో తరలిరావడం ఉద్రిక్తతకు దారి తీసింది.. ఆధిపత్య ప్రదర్శనకు కొమ్మాల జాతర వేదికయింది.
ఇది కూడా చదవండి: TG Politics: వాళ్లంతా వేస్ట్.. ఫస్ట్ ఆ పదవులు పీకేయండి.. సీఎం రేవంత్ కు మీనాక్షి సంచలన ఆదేశాలు!