/rtv/media/media_files/2025/04/08/MCwSIrSMD2Dto5m0l2YA.jpg)
Allu Arjun birthday
Allu Arjun : టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు సందడి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అభిమానులు భారీగా ఆయన నివాసం వద్దకు చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !
సోమవారం అర్ధరాత్రి కొందరు అభిమానులు బన్నీ ఫ్లెక్సీలతో జూబ్లీహిల్స్ మెయిన్‌రోడ్డులో బైక్ ర్యాలీ నిర్వహించారు. వందలాది సంఖ్యలో ఆయన అభిమానులు ఇంటికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నివాసం వద్ద ఫ్యాన్స్ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు. అల్లు అర్జున్ కు విషెస్ చెప్పేందుకు... తరలి వచ్చారు అభిమానులు.
Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’
అయితే అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో.. అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ కేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అయినప్పటికీ ఆ భారీకేడ్లను... తోసుకుంటూ అల్లు అర్జున్ ఇంటి వైపు దూసుకు వెళ్లారు అభిమానులు. దీంతో ఒక దశలో పోలీసులు చేతులెత్తేశారు.వారిని కట్టడి చేసేందుకు... పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇది ఇలా ఉండగా ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే ఉన్న నేపథ్యంలో... తన కొత్త సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. అందరూ ఊహించినట్లుగానే అట్లీ కుమార్ అనే తమిళ దర్శకుడు తో సినిమా చేస్తున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!