హోం వర్క్ చేయలేదని.. టీచర్ ఏం చేసిందంటే?

హోం వర్క్ చేయలేదని తోటి విద్యార్థులతో స్టూడెంట్‌ను టీచర్ కొట్టించడంతో చెంప కమిలిపోయింది. తోటి విద్యార్థులతో ఇలా కొట్టడం వల్ల ఆ విద్యార్థి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. మందలించాలని కానీ.. మనో వేదనకు గురయ్యేలా చేయకూడదని తండ్రి స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు.

New Update
Karimnagar teacher

Karimnagar teacher Photograph: (Karimnagar teacher)

హోం వర్క్ చేయకపోతే విద్యార్థిని టీచర్ మందలించడం సాధారణంగా జరిగేదే. కొందరు అయితే మరీ దారుణంగా విద్యార్థులను కొడుతుంటారు. అయితే కరీంనగర్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంగాధరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సమీర్ కుమార్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. ఇచ్చిన హోం వర్క్ చేయలేదని ఆ టీచర్ దండించాడు. 

ఇది కూడా చూడండి: Champions Trophy:  ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో భారత్ vs న్యూజిలాండ్..దక్షిణాఫ్రికా ఇంటికి..

తీవ్ర మనో వేదనకు గురై..

తోటి విద్యార్థులు అందరితో సమీర్ కుమార్ చెంపపై కొట్టించారు. దీంతో సమీర్ కుమార్ చెంప కమిలిపోయింది. అందరి విద్యార్థులతో ఇలా కొట్టించడం వల్ల సమీర్‌కుమార్‌ తీవ్ర వేదనకు గురయ్యాడని తండ్రి మురళీమనోహర్‌ తెలిపారు. ఇలా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటని టీచర్‌ను ప్రశ్నించాడు. హోం వర్క్ చేయకపోతే తల్లిదండ్రులకు సమాచారం అందించాలని తెలిపారు. గతంలోనూ కూడా ఇలానే జరిగితే స్కూల్ యాజమాన్యం చెప్పలేదన్నారు. పిల్లలు మనోవేదన చెందినట్లు వారిని శిక్షించవద్దని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు.

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

ఇదిలా ఉండగా తెలంగాణ ఖమ్మంలో భయంకర సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. సూపరింటెండెంట్ ఛాంబర్‌పై పెట్రో బాంబులు విసరడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది ఏం జరిగిందో తెలియక ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో కొంత ఫర్నిచర్ కాలిపోగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. అయితే అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment