పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను సమర్పించాలని సూచించింది. 

author-image
By srinivas
New Update
Food Poison

Telangana: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇటీవల వరుస ఫుడు పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థులకు నిర్దేశించిన పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కలుషిత ఆహారం కారణంగా బడి పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన పూర్తి నివేదికను సమర్పించాలని సూచిస్తూ తదుపరి విచారణను మరో 6 వారాలు వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఇది కూడా చూడండి:  పుష్ప-2 ప్రీమియర్ షోలో విషాదం.. ఒకరు మృతి

రెండు కమిటీలు ఏర్పాటు..

ఇక ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బాధ్యులైన వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసి న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. మంచి భోజనం పెట్టేందుకు ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచినట్లు తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలన్నారు. కమిటీల పర్యవేక్షణ సరిగా లేనందుకే ఇలా జరుతున్నాయని చెప్పారు. కమిటీలు సరిగా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. దీంతో అన్ని కమిటీలు పని చేస్తున్నాయని ప్రభుత్వ ఏఏజీ వివరించారు. 

ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలు.. 'పుష్ప' స్దానం ఎంతంటే?

ఇది కూడా చూడండి: రేపే పింక్‌ బాల్‌ టెస్ట్‌ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే!

ఇది కూడా చూడండి:   బాక్సాఫీస్ ను బద్దలు కొట్టిన ఇండియన్ సినిమాలు.. 'పుష్ప' స్దానం ఎంతంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు