/rtv/media/media_files/2025/03/02/lRghc2WyYu4UYiANG6EG.jpg)
ATM stolen Rangareddy district Raviryala
తక్కువ సమయంలో ధనవంతులు అయ్యేందుకు కొందరు తప్పుదోవ పడుతున్నారు. ఈ క్రమంలో చైన్ స్నాచర్లుగా, దొంగలుగా, సైబర్ కేటుగాళ్లుగా అవతారం ఎత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువైపోయాయి. కొందరేమో రిటైర్డ్ ఉద్యోగులనే టార్గెట్‌గా పెట్టుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. మనీలాండరింగ్ అని చెప్పి దొరికినంత దోచేస్తున్నారు. ఎక్కువగా వృద్ధులే వారి టార్గెట్. కోట్లలో కొట్టేసి అక్కడ నుంచి మాయం అవుతున్నారు.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
మరోవైపు ఈజీ మనీకి అలవాటు పడిన ఇంకొందరు దుండగులు చైన్ స్నాచర్లుగా అవతారం ఎత్తుతున్నారు. చిన్నా పెద్దా.. ముసలి ముతక అనే తేడా లేకుండా ఎవరు దొరికితే వారి మెడలోంచి బంగారం దొచుకుపోతున్నారు. మెడలో ఉన్న చైన్ పట్టుకుని వదలడం లేదు. ఆ చోరీ సమయంలో మహిళలు కింద పడిపోయినా తగ్గడం లేదు. ఈ మధ్య ఇవి ఎక్కువయ్యాయి. తాజాగా రాష్ట్రంలో మరో చోరీ జరిగింది.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
రూ.30 లక్షలు లూటీ
ఈ చోరి కేవలం కళ్లు మూసి తెరిచేలోగా జరిగిపోయింది. కేవలం నాలుగే నిమిషాల్లో రూ.30 లక్షలు దోచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఊహించని దొంగతనం జరిగింది. రావిర్యాలలోని ATMని కొందరు దుండగులు చోరీ చేశారు. కేవలం నాలుగు నిమిషాల్లోనే కొందరు దొంగలు ATMని లూటీ చేశారు. ఏటీఎంలో ఉన్న రూ.30 లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్‌జెండర్లు.. భారత్‌లోనూ మూతపడ్డ ఆ క్లినిక్‌లు!
కాగా ఈ దొంగతనం కోసం పక్కా ప్లానింగ్‌తో కారులో వచ్చి చోరీ చేశారు. తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లతో మిషిన్‌ను కట్ చేశారు. అంతేకాకుండా తమ ముఖాలు తెలియకుండా ఉండాలని సీసీ కెమెరాలపై స్ప్రే కొట్టారు. అది మాత్రమే కాదు ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా వైర్లు కూడా కట్ చేశారు.
దీని బట్టి చూస్తే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. చుట్టు పక్కల వారు ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. ఇక ఈ విషయం డీసీపీ సునీతా రెడ్డికి తెలియడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని అన్నారు.