/rtv/media/media_files/2025/03/28/Cpua1LI6H02oEKWQkYXr.jpg)
telangana man marries two girls at one time
తెలంగాణలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఒకేసారి ఇద్దరి యువతులను పెళ్లి చేసుకుని వార్తల్లోకెక్కాడు. అంతేకాదండోయ్.. పెళ్లి శుభలేఖలోనూ ఆ ఇద్దరి అమ్మాయిల పేర్లు కొట్టించి.. తమ పెళ్లికి రమ్మని బంధువులు, మిత్రులను ఆహ్వానించాడు. ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు.. ప్రేమ పెళ్లి.
మరో విషయం ఏంటంటే.. ఈ పెళ్లికి ఇరువురి యువతుల తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వారందరి సమక్షంలోనే ఆ యువకుడు ఇద్దరి యువతుల మెడలో ఆరు ముళ్లు వేసి 14 అడుగులు నడిచాడు. ఇలా ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా ఆ యువకుడు మారాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
పెళ్లిగా మారిన ప్రేమ బంధం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, గుమ్నూర్‌కు చెందిన సూర్యదేవ్ ఒక సాధారణ రైతు. అతడు మూడేళ్ల క్రితం లాల్దేవి, జలకర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాడు. అయితే ఆ యువతులు ఇద్దరూ అక్కా చెల్లెల్లు కాదు.. అలా అని స్నేహితులు కూడా కాదు. పోనీ ఇద్దరిదీ ఒకే గ్రామమా? అంటే అదీ లేదు. ఇద్దరు అమ్మాయిలదీ వేరు వేరు గ్రామాలు. కానీ వారిద్దరి ఆలోచనా విధానం ఒక్కటే.. ఎలాగైనా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం. ఇక ఆ యువకుడు కూడా ఎవరినీ బాధపెట్టకుండా ఇద్దరినీ పెళ్లి చేసుకుని వారికో చక్కని జీవితం అందించాలని నిర్ణయించుకున్నాడు.
ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025
ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, ఘనంగా వివాహం చేసుకున్న యువకుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న… pic.twitter.com/Tbre507zTB
Also read: బ్రెయిన్‌లో ప్లాస్టిక్ చెంచా.. డేంజర్ జోన్‌లో చూయింగ్‌గమ్ తినేవాళ్లు!
ఇందులో భాగంగానే ఆ ఇద్దరి యువతులను పెళ్లి చేసుకుంటానంటూ మొదట తన ఇంట్లో ఒప్పించాడు. అంతేకాదు.. ఆ ఇద్దరు అమ్మాయిల తల్లిదండ్రులు సైతం ఒప్పుకునేలా చేశాడు. దానికోసం ఒక బాండ్ పేపర్ రాసాడు. ఫ్యూచర్‌లో ఆ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానంటూ అందులో రాసుకొచ్చాడు. దీంతో ఇరువురి అమ్మాయిల తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఇలా ఇప్పుడు ఒకే మండపంలో.. ఒకే ముహుర్తానికి ఇద్దరి మెడలో ఆరుముళ్లు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
Also read: బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. నేలమట్టమైన భవనాలు
(viral-news | latest-telugu-news | telugu-news | telangana | today news)