TG News: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఇప్పట్లో లేనట్లే!

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు సునితంగా పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇళ్ల కేటాయింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 

New Update
Revanth indiramma

Telangana Indiramma houses Allotment delayed Cm revanth

TG News: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు ఈనెల 26 నుంచి నాలుగు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుండగా.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభల్లో గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను మాత్రమే ప్రకటిస్తుండగా.. కొత్త లబ్ధిదారుల జాబితాను ప్రకటించడం లేదు. అంతేకాక  రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామసభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామసభల్లో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించిన తర్వాతే పూర్తిస్థాయి జాబితాపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

80.54 లక్షల మంది దరఖాస్తులు.. 

గతంలో ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80.54 లక్షల మంది దరఖాస్తులు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో ఆరు గ్యారెంటీలకు వచ్చిన దరఖాస్తులను ఆసరాగా చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను అధికారులు ఎంపిక చేశారు. వీటి పరిశీలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్‌లో లబ్దిదారుల వివరాలు నమోదు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో  సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నా...పలుచోట్ల దరఖాస్తు దారుల నుంచి సర్వే చేపట్టలేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామసభల్లో మరోసారి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.  

మరింత పెరిగే ఛాన్స్..

అయితే ఇందిరమ్మ ఇళ్ల పంపీణీలో ప్రభుత్వం ఫస్ట్ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవారికే ఇళ్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇంటి స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. అయితే, నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే  గ్రామసభల్లో అధికారులు రెండు రకాల వివరాలు సేకరిస్తున్నారు. లబ్దిదారుల్లో సొంత స్థలం ఉన్నవారు, ఇంటి జాగా లేనివారి వివరాలు ప్రత్యేకంగా సేకరిస్తున్నట్తు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: KCR Sister Dead: కేసీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం..

మరోవైపు లబ్దిదారుల ఎంపికకు సంబంధించి మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్‌లకు మాత్రమే పంపిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులకు, హౌసింగ్‌ శాఖ పీడీలకు ఈ సమాచారాన్ని అందించడం లేదని తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగంలో కూడా లబ్ధిదారులకు సంబంధించిన సమాచారంలో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జనవరి 26నుంచి పథకాన్ని ప్రారంభించినా.. లబ్దిదారుల జాబితా పూర్తి స్థాయిలో అధికారులకు చేరేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక లబ్దిదారుల ఎంపిక ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులే ఫైనల్ చేస్తుండటంతో లబ్దిదారుల ఎంపిక, ఇళ్ల పంపీణీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: USA: అమెరికాలోనే చరిత్రలోనే అతి పెద్ద ఏరివేత..వైట్ హౌస్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు