నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 2022లో చంచల్‌గూడ జైలు వద్ద ఎస్సీ, ఎస్టీలను కించపరిచేలా వ్యాఖ్యానించారంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బంగారు సాయులు అనే వ్యక్తి అరవింద్‌పై పోలీసు కేసు కూడా పెట్టారు. నిజామాబాద్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీస్ స్టేషన్‌కు ఈ కేసు బదిలీ అయ్యింది. Also Read: కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే? ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ధర్మపురి అరవింద్ హైకోర్టును ఆశ్రయించారు. ఎస్సీ, ఎస్టీలను కించపరచలేదని.. నిరాధార ఆరోపణలతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. అయితే అరవింద్‌కు న్యాయస్థానంలో బిగ్ షాక్ తగిలింది. బుధవారం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. దాన్ని కొట్టివేసింది. కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనని.. కింది కోర్టుతో తేల్చుకోవాలని జస్టిస్ కె.లక్ష్మణ్ తెలిపారు. కింది కోర్టులో ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Also Read: మీది ప్రజాపాలన కాదు.. రాక్షసపాలన.. కౌశిక్‌రెడ్డి ఇష్యుపై హరీష్‌రావు ఆగ్రహం ఇదిలాఉండగా.. నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ధర్మపురి అరవింద్ రెండోసారి గెలిచిన సంగతి తెలిసిందే. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. ఓడిపోయారు. చివరికి మరోసారి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన రెండోసారి గెలిచారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి దక్కించుకునేందుకు ధర్మపురి అరవింద్ కూడా బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ.. Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!