Telangana : తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో స్మార్ట్ కార్డులు!

తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కోసం ఇకపై ఆధార్ కార్డు పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే మీ చేతికి స్మార్ట్‌కార్డులు రాబోతున్నాయి.

New Update
smart cards

తెలంగాణలో మహిళలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి పథకం(mahalakshmi-scheme)) కోసం ఇకపై ఆధార్ కార్డు(aadhaar-card) పట్టుకుని తిరగాల్సిన పనిలేదు. త్వరలోనే మీ చేతికి స్మార్ట్‌కార్డులు రాబోతున్నాయి. అవును.. 2026 జూన్ 2వ తేదీ (తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) నుంచి ఈ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించి, కార్డుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్టీసీని ఆదేశించారు.

మొదటగా ఈ స్మార్ట్‌కార్డులను రాష్ట్రవ్యాప్తంగా కాకుండా జిల్లాకు ఒక మండలాన్ని ఎంచుకుని ప్రయోగాత్మకంగా పంపిణీ చేయనున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టులో సుమారు 5 లక్షల మంది మహిళలకు కార్డులు అందజేయనున్నారు. ఇందులో ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వాటిని సరిదిద్దిన తర్వాత, రాష్ట్రమంతటా ఉన్న మిగిలిన మహిళలకు కార్డులు జారీ చేస్తారు. ఈ స్మార్ట్‌కార్డు(TGSRTC Smart Cards) ల్లో ఒక ప్రత్యేక చిప్ ఉంటుంది, దీనివల్ల ప్రయాణికుల వివరాలు చాలా ఈజీగా రికార్డు అవుతాయి.

ఈ కార్డుపై మహిళ ఫోటోతో పాటు, కండక్టర్ దగ్గర ఉండే టికెట్ మిషన్  స్కాన్ చేసేలా ఒక క్యూఆర్ కోడ్ లేదా చిప్ ఉంటుంది. దీనివల్ల ప్రయాణికురాలు అసలైన లబ్ధిదారా కాదా అనేది వెంటనే తెలిసిపోతుంది. 

Also Read :  ఈటల, రఘునందన్‌కు బిగ్ షాక్.. పొత్తులపై హైకమాండ్ ఫైర్ !

మూడు రకాల డిజైన్లను సిద్ధం

ఈ కార్డుల కోసం ఆర్టీసీ మూడు రకాల డిజైన్లను సిద్ధం చేసింది. వీటిని ఇప్పటికే మంత్రులకు చూపించగా, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కూడా పరిశీలించి ఒకదాన్ని ఫైనల్ చేయనున్నారు. ఈ చిప్ కార్డుల తయారీ కోసం సుమారు 75 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని ఆర్టీసీ కోరింది. కొత్త బడ్జెట్‌లో వీటికి అవసరమైన నిధుల కేటాయింపుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కార్డు నమూనాను ఫైనల్ చేసిన తర్వాత, అసలు కార్డు ఎలా ఉంటుంది? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? అనే దానిపై పూర్తి మార్గదర్శకాలు విడుదలవుతాయి.

Also Read :  ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో బిగ్‌ ట్విస్ట్‌.. తనను వారే కిడ్నాప్‌ చేశారన్న యాదగిరి

Advertisment
తాజా కథనాలు