IAS Aravind Kumar: IAS అరవింద్ కుమార్ సస్పెండ్

ఫార్ములా ఈ కార్ రేసింగ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్‌ను రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

New Update
Telangana Govt Suspends IAS Aravind Kumar

Telangana Govt Suspends IAS Aravind Kumar

ఫార్ములా ఈ కార్ రేసింగ్(formula e car racing) వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్‌ను రేవంత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం కూడా పర్మిషన్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి అరవింద్‌పై అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం లాంటి ఆరోపణల రావండతో ప్రభుత్వం ఆయన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆయనపై విచారణ పూర్తయ్యేవరకు ఈ సస్పెండ్ కొనసాగుతుంది.  

Also read: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. మూడు కార్పొరేషన్‌లకు ప్రత్యేక చట్టం

IAS Aravind Kumar Suspended

మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై కూడా ప్రాసిక్యూషన్‌కు కొంతకాలం క్రితమే గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. ఇప్పటికే బీఎల్‌ఎన్‌ రెడ్డి పదవీ విరమణ చేశారు. 

Also Read: భారత పార్లమెంట్‌కు తొలిసారి LGBTQ మహిళ.. ఎవరీ మేనకా గురుస్వామి ?

Advertisment
తాజా కథనాలు