/rtv/media/media_files/2026/04/25/azaruddin-and-kodandaram-2026-04-25-13-33-10.jpg)
azaruddin , kodandaram Appointed As MLAs
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత.. గవర్నర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత మైనార్టీ శాఖ మంత్రిగా ఉన్న అజారుద్దీన్‌కు ఈ ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ఆయన మంత్రి పదవిలో కొనసాగేందుకు రాజ్యాంగబద్ధమైన వెసులుబాటు కలిగింది. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లు 6 నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది.
Also Read: కవిత కొత్త పార్టీ TRSగా నామకరణం.. అయిదు కీలక హామీలు
ఇక ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో ప్రభుత్వం మేధావులకు, ఉద్యమకారులకు పెద్దపీట వేసినట్లయింది.
గతంలో వీళ్లిద్దరి పేర్లను గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ దీన్ని సవాలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో నామినేట్ అయిన అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తమ నియామకాలను గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమంటూ వాదనలు వినిపించారు. దీంతో కోదండరాం, అజారుద్దీన్‌ల నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఈ వివాదం నెలల తరబడి కొనసాగింది. ఎట్టకేలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో వీళ్లద్దరి ఎమ్మెల్యీ అభ్యర్థిత్వానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
Also Read: రోడ్డెక్కిన బస్సులు.. ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా పీఆర్సీ పెంపు..
Follow Us