Telangana: తెలంగాణలో మందుబాబులకు షాక్...ధరల పెంపు!

తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది.

New Update
liquor

Telangana: తెలంగాణలో మందు బాబులకు గవర్నమెంట్‌ ఓ బ్యాడ్‌న్యూస్ చెప్పడానికి రెడీ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయితే గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచకుండా స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సదరు మద్యం కంపెనీలు.. మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాల్సిన అవసరం వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Also Read:Breaking: చిత్తూరులో ఘోర ప్రమాదం..నలుగురు మృతి!

అయితే మద్యం ధరల పెంపుపై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక కసరత్తులు మొదలు పెట్టింది. ఏ విధంగా మద్యం ధరలు పెంచాలి అనే దానిపై ఆలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. మద్యం ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Also Read: Telangana: హమ్మయ్య చలి కాస్త తగ్గింది..పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ధరలను పెంచడంతో పాటు..

తెలంగాణలో చివరిసారిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం ధరలు పెంచారు. గడిచిన 4 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యం ధరలు పెంచలేదని ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ లిమిటెడ్.. తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా తెలిపింది. మద్యం ధరలను పెంచడంతో పాటు.. మద్యం విక్రయాలపై తమకు ఇచ్చే మార్జిన్‌ను కూడా పెంచాలని ఆ సంస్థ సర్కారుకు రాసిన లేఖలో పేర్కొంది. అయితే మద్యం ధరలు పెంచాలని.. మద్యం కంపెనీల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల కమిటీని 6 నెలల క్రితమే ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ తొలిసారి జులై 18వ తేదీన సమావేశమైంది. జులై 25వ తేదీ లోగా కంపెనీలు మద్యం సరఫరా కోసం ధరలు కోట్‌ చేయాలని సర్క్యులర్‌ ఇచ్చింది. ఆ తర్వాతి రోజే సీల్డ్‌ కవర్లు తెరిచి కంపెనీలు కోట్‌ చేసిన ధరలను కమిటీ పరిశీలించింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని.. బీరు, బ్రాందీ, విస్కీ, రమ్‌, వైన్‌, ఫారిన్ లిక్కర్ సహా మొత్తం 1032 బ్రాండ్లకు ధర కోట్‌ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన బీర్ల కంపెనీతో పాటు సోమ్‌ డిస్టిలరీ, కర్ణాటక, గోవా, మహారాష్ట కంపెనీలు, హైదరాబాద్‌ కంపెనీలు కూడా ఉన్నట్లు సమాచారం.

Also Read:Horoscope: నేడు ఈ రాశివారికి అనుకున్న పని పూర్తి అయిపోతుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే!

Also Read: Open AI: నా కొడుకుని ఓపెన్ ఏఐ నే చంపేసింది!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vidadala Rajini : మాజీమంత్రికి బిగ్ షాక్....మరిది అరెస్ట్

మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు విజయవాడకు తరలించారు. క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని గోపీపై కేసు నమోదైంది.

New Update
Vidadala Rajini

Vidadala Rajini

Vidadala Rajini: మాజీ మంత్రి, వైసీపీ మహిళా నేత విడుదల రజనికి బిగ్ షాక్ తగిలింది. ఆమె మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఆయన్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. విజయవాడకు తరలిస్తున్నారు. యడ్లపాడు కంకర క్వారీ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని రజినితోపాటు గోపీపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే అతడ్ని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: ఈ పండ్లు తింటే క్యాన్సర్‌ పరార్.. ఆ అద్భుతమైన ఆహారాలు ఇవే


గోపిని  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విడదల గోపినాథ్ ను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చి ఏపీకి తీసుకెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ.. తాజాగా అరెస్ట్ చేసింది.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
 
కాగా.. మాజీ మంత్రి విడదల రజనిపై ఏసీబీ ఈ ఏడాది మార్చిలో కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమ్యాన్నాని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చారు ఏసీబీ అధికారులు. ఏ2గా ఐపీఎస్ అధికారి జాషువా పై కేసు నమోదు చేశారు. ఏ3గా గోపి, ఏ4గా రజనీ పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. విడదల రజని వాటా 2 కోట్లు ఇచ్చినట్టు కేసు నమోదు చేయగా.. ఆమె మరిది గోపి, జాషువాలకు చెరో 10 లక్షలు ఇచ్చినట్లు కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు