/rtv/media/media_files/2025/04/07/3nT8PIenQzfj6enWJ7e8.jpg)
tg-high-court-hcu
Hyderabad: HCU భూ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కృత్రిమమేధ సాయంతో ఫైక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. 400 ఎకరాల భూ వివాదంలో నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్ తయారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన..
బుల్డోజర్లను చూసి నెమళ్లు, జింకలు పారిపోతున్నట్లు ఫేక్ ఫొటో, వీడియోలు క్రియేట్ చేశారని పిటిషన్ లో వివరించారు. ఇటీవలే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్‌వర్క్ ద్వారా కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Also Read: నగరంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి ఆ హోటల్‌లో అత్యాచారం!
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు (Fake Videos), ఫొటోలు (Fake Photos) కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సర్వే నెంబర్ 25 లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలను నిర్మించారు. వాటిని నిర్మించే సందర్భాల్లో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
Also Read: ''ట్రంప్ మాకొద్దు నీ కంపు''.. అమెరికా అంతటా పెద్ద ఎత్తున నిరసనలు
అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు వివరించారు. వాస్తవాలు వెల్లడించే లోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు ముఖ్యమంత్రి గారికి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సమావేశంలో వివరించారు.
cm revanth | high-court | today telugu news