New Update
/rtv/media/media_files/2025/12/07/telangana-2025-12-07-17-57-34.jpg)
Telangana gears up for Global Summit showcasing innovation, 3 trillion USD vision
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ సిద్ధమైపోయింది. నగర పరిధిలో వివిధ ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారుల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్లాన్‌ను రూపొందించారు.
Telangana Raising Global Summit 2025
రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యేలా డిస్‌ప్లేలు కూడా ఏర్పాటు చేశారు. దుర్గం చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోను ఇన్‌లిట్ టెక్నిక్‌తో ప్రదర్శించనున్నారు. హుస్సేన్‌సాగర్‌లో వాటర్ ప్రొజెక్షన్‌తో భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువతరైతు ప్రధాన కార్యక్రమాలు, అలాగే 3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ లాంటి అంశాలను ప్రదర్శించనున్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే రోడ్‌పై భారీ డిజిటల్ LED స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. దీనిపై భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంతదూరం అనే వివరాలు ఏర్పాటుచేశారు. నగరవ్యాప్తంగా గ్లోబల్ సమిట్ లోగోతో తయారుచేయించిన 1500 రంగురంగుల జెండాలతో డెకరేట్ చేయించారు. అంతేకాదు ఫ్యూచర్ సిటీ ప్లాన్, డిజిట్ స్క్రీన్లపై విజువల్స్, అలాగే సమిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. ఇదిలాఉండగా డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సమ్మిట్ జరగనుంది.
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే లక్ష్యంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అత్యుత్తమ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టం చేశారు.
— Telangana CMO (@TelanganaCMO) December 6, 2025
❇️ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న… pic.twitter.com/CrXX5D1Cpp
తాజా కథనాలు
Follow Us