/rtv/media/media_files/2025/03/23/RSbDzd0sp8xcCOBVVxII.jpg)
Online Betting and CM revanth
ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడి ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వేలు, లక్షలు, కోట్లల్లో అప్పుల పాలవుతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గతేడాది తెలంగాణలో బెట్టింగ్ యాప్స్‌కు బలై దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌ప్రమోట్ చేసిన పలువురు సినిమా సెలబ్రిటీలు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రీడ ఏదో తెలుసా..?
అయితే ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమాదాల నుంచి పౌరులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా బెట్టింగ్ యాప్స్ మోసాలకు గురైన, లేదా మీకు కనిపించే బెట్టింగ్ యాప్స్‌పై ఫిర్యాదులు చేసేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఓ నెంబర్‌ను విడుదల చేసింది. 8712672222 నెంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు.
Also Read: ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్న కెనడా.. ఆ పార్టీ వైపే ఓటర్లు
ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమాదాల నుండి పౌరులను రక్షించడానికి , తెలంగాణ లో ఆన్‌లైన్ గేమింగ్ పై కఠినమైన చర్యలలో భాగంగా 385 కేసులు నమోదయ్యాయి. — బెట్టింగ్ యాప్‌లను అరికట్టడానికి బలమైన చర్యలు అమలులో ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలకు గురి అయితే, లేదా మీకు కనిపించే బెట్టింగ్ ప్లాటుఫారంలపై… pic.twitter.com/3H5KXAKNmz
— TGCyberBureau (@TGCyberBureau) March 21, 2025
Also Read: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్
Also Read: 9 ఏళ్ల పిల్లాడిని వదిలి ప్రియుడితో తల్లి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?
betting-apps | telugu-news | telangana | online-betting