/rtv/media/media_files/2025/03/09/us7wTVYEOI4kQ0bmDHds.jpg)
mlc list000 Photograph: (mlc list000)
తెలంగాణాలో 5 MLA కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. అందులో అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే.. కాంగ్రెస్‌కు నాలుగు, బీఆర్ఎస్‌కు ఒకటి వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న సీపీఐకి ఓ ఎమ్మెల్సీ సీటు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. మరో మూడు MLCలకు పార్టీలో పలువురి పేర్లు పరిశీలించారు. అభ్యర్థుల ఎంపిక కోసం ఖర్గేతో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇంట్లో కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయి గంటన్నర పాటు చర్చించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేశారు. కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్ లకు ఎమ్మెల్సీ కేటాయించారు.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది. AICC చైర్మన్ మళ్లిఖార్జున ఖర్గే, కార్యదర్శి వేణు గోపాల్ MLC అభ్యర్థుల లిస్ట్ తయారు చేశారు. కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, అద్దంకి దయాకర్ లకు ఎమ్మెల్సీ కేటాయించారు.@INCTelangana @revanth_anumula… pic.twitter.com/R32SjtKjOO
— RTV (@RTVnewsnetwork) March 9, 2025
Also read: Egg smuggling: బర్డ్ ఫ్లూ భయంతో అమెరికాలో కోడిగుడ్లు స్మగ్లింగ్.. అద్దెకు కోడిపెట్టలు
శంకర్ నాయక్, అద్దంకి దయాకర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్టీ, ఎస్సీ నాయకులు కాగా.. విజయ శాంతి గతంలో మెదక్ ఎంపీగా పని చేశారు. శంకర్ నాయక్ నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరో సీటును సీపీఐ పార్టీకి ఇచ్చారు. విజయ శాంతి పేరు ఇన్నిరోజులుగా చర్చలో లేకున్నా అనూహ్యంగా ఫైనల్ లిస్ట్‌లో వచ్చింది. ఇక శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, సూర్యాపేట, నాగర్జున సాగర్, హుజూర్ నగర్ ప్రాంతాల్లో గిరిజన తండాల్లో మంచి పట్టు ఉంది. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్నాడు. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానా రెడ్డి శంకర్ నాయక్ పేరును హైకమాండ్‌కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
Also read:Kumbh Mela: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్