KCR: కేసీఆర్‌పై చర్యలు అప్పుడే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం!

విద్యుత్ ప్లాంట్ విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన తప్పిదాలపై తెలంగాణ కేబినేట్‌లో చర్చించారు. న్యాయనిపుణులు పరిశీలనకు పంపించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించుకుంది.కేవలం కేసీఆర్‌పైనే కాకుండా.. మిగతా పాత్రదారులపై కూడా చర్యలు తీసుకోనున్నారు.

New Update
KCR 2

KCR

ప్లాంట్ల నిర్మాణాలు, విద్యుత్ ఒప్పందాల విషయాల్లో జరిగిన తప్పిదాలపై మాజీ సీఎం కేసీఆర్‌పై న్యాయనిపుణులు సలహా మేరకు చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో శనివారం దీనిపై చర్చించారు.

ఇది కూడా చూడండి: TS:  గ్రామ సభల్లో రేషన్‌ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

న్యాయనిపుణులు పరిశీలనకు పంపించిన తర్వాత..

దీనిపై పూర్తిగా విచారించి న్యాయనిపుణులు పరిశీలనకు పంపించిన తర్వాతే చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించుకుంది. కేవలం కేసీఆర్‌పైనే కాకుండా.. మిగతా పాత్రదారులపై కూడా చర్యలు తీసుకోనుంది. విద్యుత్ విషయాలపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ వేయాలా? లేకపోతే నివేదికను అసెంబ్లీలో పెట్టాలా? కేసుకు ఫిల్ చేయాలా? అనే దానిపై ప్రభుత్వం చర్చించింది. 

ఇది కూడా చూడండి:AP: డాకూ మహరాజ్ టికెట్ల పెంపుకు అనుమతి

విద్యుత్ విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చే 25 ఏళ్లలో ప్రజలపై రూ.9వేల కోట్ల భారం పడనున్నట్లు నివేదికలో తేలింది. ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందంతో రూ.3,642 కోట్ల నష్టం జరిగిందని జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికలో తెలిపింది. అప్పట్లో రూ.3.60కే యూనిట్ కరెంట్ లభించిందని, కానీ ఇప్పుడు రూ.2 వేల కోట్లు ఎక్కువ పడిందని మంత్రి వర్గం తెలిపింది. 

ఇది కూడా చూడండి: HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు

ఇది కూడా చూడండి: SBI Clerk Notification 2025: SBIలో 14 వేల క్లర్క్ ఉద్యోగాలు.. మూడు రోజులే ఛాన్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు