తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఈ భేటీ జరిగింది. ఇందులో భాగంగా మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. జనవరి నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కూడా అమలు చేస్తామని తెలిపారు. '' వ్యవసాయ యోగ్యమైన భూములన్నంటికీ రైతు భరోసా ఇస్తాం. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఇస్తాము. ఈ పథకానికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరు పెట్టాం. జనవరి 26న రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేస్తామని'' సీఎం రేవంత్ తెలిపారు. Also Read: ప్రతి సోమవారం హైడ్రా ప్రజావాణి.. ఈ నంబర్లకు కాల్ చేయండి! మరోవైపు పాలమూరు - రంగరెడ్డి ఎత్తిపోతల పథకానికి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో 588 కారణ్య నియామకాలకు ఆమోదం తెలిపినట్లు సమచారం. రాష్ట్రవ్యాప్తంగా 56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో వీలినానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.